Andhra Pradesh: విశాఖలో ఊహకందని విషాదం.. ఆ నిందను తట్టుకోలేక రైలుకు ఎదురెళ్లిన బాలుడు.. చివరకు..

|

Feb 12, 2023 | 7:36 AM

విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మైదానంలోని చెట్టుకు ఉన్న తేనె తుట్టెను కొట్టేందుకు వెళ్లిన వంశీకృష్ణ అనే విద్యార్థిపై పక్కనే ఉన్న భవనం యాజమాని దొంగతనం నేరం మోపారు.

Andhra Pradesh: విశాఖలో ఊహకందని విషాదం.. ఆ నిందను తట్టుకోలేక రైలుకు ఎదురెళ్లిన బాలుడు.. చివరకు..
Ragging
Follow us on

విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మైదానంలోని చెట్టుకు ఉన్న తేనె తుట్టెను కొట్టేందుకు వెళ్లిన వంశీకృష్ణ అనే విద్యార్థిపై పక్కనే ఉన్న భవనం యాజమాని దొంగతనం నేరం మోపారు. దాంతో మనస్థాపానికి గురైన వంశీకృష్ణ , ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపైకి వెళ్లాడు. అయితే, చివరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకొని పట్టాలనుంచి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే రైలు దూసుకురావడంతో వంశీ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. జీవీఎంసీ 95వ వార్డు చింతలగ్రహారంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది.

ఒకవేళ తానూ చనిపోతే, తన తల్లిదండ్రులను ఇంటి యాజమానులు ఖాళీ చేయకుండా చూడాలని వంశీకృష్ణ సూసైడ్‌ లెటర్‌లో పేర్కొన్న వైనం అందర్నీ కలిచివేసింది. వంశీకృష్ణకు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ లేఖలో స్పష్టంగా తెలుస్తోంది. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడో రాసిన లేఖ అందరి నీ ఆవేదనకు గురి చేస్తోంది.. తాను ఓ చెట్టుకు ఉన్న తేనె తుట్టెను కొట్టేందుకు వెళ్తే.. పక్కన ఉన్న భవనం వాళ్ళు దొంగతనం చేసేందుకు వెళ్లినట్టు భావించారని వంశీ కృష్ణ లేఖలో రాశాడు. అందుకోసమే ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపైకి వెళినట్లు వివరించాడు.

తాను చనిపోతే తమ తల్లి తండ్రుల చేత ఇంటిని యజమానులు ఖాళీ చేయించకుండా చూడాలని పేర్కొన్నాడు. వంశీకృష్ణ సున్నితత్వాన్ని, తల్లితండ్రుల పట్ల తనకు ఉండే ప్రేమను చాటుతోంది. రైలుకు ఎదురెళ్లి చివరిక్షణంలో పక్కకి దూకడంతో ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయని, చికిత్స కోసం స్థానిక హాస్పిటల్ లో చేర్చిన రైల్వే పోలీసులు తర్వాత కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం వంశీ కృష్ణ ఆరోగ్యం, నిలకడగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..