
ఇదిగో పైన ఫోటోలోని మామిడి చెట్టును చూడండి. ఆ చెట్టుకు మామిడి కాయలతో పాటు సొరకాయలు కూడా వేలుడుతూ కనిపిస్తున్నాయ్. విచిత్రంగా ఉంది కదూ..! అసలు విషయానికి వచ్చేద్దాం. మామిడి కాయలు.. మామిడి చెట్టుకు కాస్తాయి.. దొండకాయ, కాకరకాయ, బీరకాయ, సొరకాయ లాంటి పాదు జాతి చెట్లు పందిళ్లకు పాకి కాయలు వేలాడుతూ ఉంటాయి. కానీ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గాదం పాలెంలో మామిడి చెట్టుకు సొరకాయలు వేలాడుతూ కనిపించాయి. ఆ చెట్టును చూసిన ప్రతి ఒక్కరికీ కూడా వింతగా కనిపించింది. దగ్గరకు వెళ్లే చూస్తే తప్ప అసలు విషయం తెలియదు.
ఎందుకంటే.. ఓ రైతు తన ఇంటి ఆవరణలో మామిడి చెట్టు పెంచాడు. ప్రస్తుతం సీజన్ కావడంతో ఆ చెట్టుకు కాయలు కాస్తున్నాయి. అయితే.. ఆ చెట్టుకు సమీపాన సొర పాదు కూడా నాటడంతో అది చెట్టు పైకి పాకింది. ఆ మామిడి చెట్టుని పందిరిగా చేసుకొని కాయలు కాస్తోంది. మామిడి చెట్టు పైనుంచి సొరకాయలు కిందకు వేలాడుతూ భలేగా కనిపిస్తున్నాయి. చెట్టుకు మామిడికాయలు, ఆ పక్కనే సొరకాయలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో అది అచ్చం మామిడి చెట్టుకు సొరకాయలు కాసినట్లు కనిపిస్తోంది. దీంతో ఆ చెట్టును అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..