AP News: అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. గ్యాస్ లీకేజీతో ఎగిసిపడ్డ మంటలు.. ఆరుగురు దుర్మరణం

|

Apr 14, 2022 | 7:38 AM

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్‌ ఫ్యాక్టరీలో

AP News: అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. గ్యాస్ లీకేజీతో ఎగిసిపడ్డ మంటలు.. ఆరుగురు దుర్మరణం
Fire
Follow us on

Eluru district fire accident: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం (Akkireddigudem) లో ఉన్న పోరస్ కెమికల్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి గ్యా్‌స్ లీకేజీతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పోరస్‌ ఫ్యాక్టరీలోని యూనిట్‌ 4లో మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది కార్మికులు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరోకరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ, నూజివీడుకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా.. మంటల్లో రెండు ఫ్లోర్లు పూర్తిగా కాలిపోయాయి.

మృతుల్లో నలుగురు బీహార్‌కు చెందిన కార్మికులని.. మిగిలిన ఇద్ధరు క్రృష్ణ కెమిస్ట్, ఆపరేటర్ కిరణ్ గా గుర్తించారు. కాగా.. తెల్లారటంతో మరోసారి ఫ్యాక్టరీలోని అన్ని బ్లాక్‌లను తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో నైట్రిక్ యాసిడ్, మోనో మిథైల్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వినియోగిస్తున్నట్లు సమాచారం. పాలమర్స్ కంపెనీకి రా మెటీరియల్ తయారు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

Also Read:

Love Story: అచ్చం ‘శివమణి’ సినిమాలాగే.. 56 ఏళ్ల నాటి సీసాలో దొరికిన లెటర్.. ఓపెన్ చేస్తే మైండ్ బ్లాంక్..!

Viral Video: ఈ చెట్టు చాలా స్పెషల్ గురూ.. ఆక్సీజన్ మాత్రమే కాదు నీటిని కూడా ఇస్తుంది.. వీడియో మీకోసం..!