Watch Video: బ్లాక్ కింగ్ కోబ్రా కాటేస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..
కింగ్ కోబ్రా.. మనకు తరచుగా కనిపించే సాధారణ పాములతో పోలిస్తే చూడటాని నల్లగా చాలా పొడవుగా, లావుగా ఉంటుంది. చాలా యాక్టివ్ గాను, స్పీడ్ గాను కదులుతుంది. దీని సైజుకి తగ్గట్టుగానే కింగ్ కోబ్రా నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక పొరపాటున కూడా కరిచిందంటే.. భూమి మీద వారికి నూకలు చెల్లినట్టే.. అంత ప్రమాదకరమైన పాము ఇది.

కింగ్ కోబ్రా.. మనకు తరచుగా కనిపించే సాధారణ పాములతో పోలిస్తే చూడటాని నల్లగా చాలా పొడవుగా, లావుగా ఉంటుంది. చాలా యాక్టివ్ గాను, స్పీడ్ గాను కదులుతుంది. దీని సైజుకి తగ్గట్టుగానే కింగ్ కోబ్రా నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక పొరపాటున కూడా కరిచిందంటే.. భూమి మీద వారికి నూకలు చెల్లినట్టే.. అంత ప్రమాదకరమైన పాము ఇది.. సాధారణంగా దట్టమైన ఆఫ్రికా అడవుల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో.. కూడా వీటి సంచారం ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తుంటాయి.. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు, విశాఖ, మన్యం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.. ఇవి కరవటం మాట ఏమో గాని.. దగ్గరగా చూస్తే చాలు భయంతో ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి.. అరుదైన కింగ్ కోబ్రా పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామమైన సీతంపేటలో హల్ చల్ చేసింది. సోమవారం సీతంపేటలోని దుర్గా నర్సరీలో సంచరిస్తూ నర్సరీ నిర్వాహకుల కంట పడింది. ఒక్కసారిగా అంత పెద్ద కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో స్పందించిన అటవీశాఖ అధికారులు శ్రీకాకుళం నుండి ఖాన్ అనే స్నేక్ క్యాచర్ ని రప్పించారు.
ఖాన్ వచ్చే వరకు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా కింగ్ కోబ్రా ఎటువెళ్తుందో పరిశీలిస్తూ ఉన్నారు నర్సరీ నిర్వాహకులు. ఇంతలో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను వెంబడించి చివరకు చాకచక్యంగా, ఒడుపుగా దానిని బంధించాడు.. తిరిగి నిర్మానుష్యంగా ఉన్న సమీప ఏజెన్సీలో దానిని విడిచి పెట్టారు. అయితే కింగ్ కోబ్రాను పట్టుకొనే క్రమంలో అది బుసలు కొడుతూ రగిలిపోయింది. స్నేక్ క్యాచర్ దాని దృష్టి మళ్లించేందుకు చెప్పును చూపిస్తూ అటూ ఇటూ ఆడించగా ఒక్కసారిగా నోటితో చెప్పును అందుకొని కరచింది. అనంతరం దాని నోటి నుండి చెప్పును బయటకు తీయటానికి తిప్పలు పడ్డాడు.. స్నేక్ క్యాచర్.
వీడియో చూడండి..
మొత్తానికి ఏదో ఒక విధంగా కింగ్ కోబ్రాను రెస్క్యూ చేయడంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
