AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంతకల్లు కుర్రోడి సత్తా.. Btech చదువుతుండగానే రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలో జాబ్!

గుంతకల్లుకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతున్న సదరు విద్యార్ధి చదువు పూర్తికాకుండానే ఇంత పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం..

గుంతకల్లు కుర్రోడి సత్తా.. Btech చదువుతుండగానే రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలో జాబ్!
Btech Student Secured Job At Optiver Software Company In America
Srilakshmi C
|

Updated on: Sep 10, 2025 | 11:59 AM

Share

గుంతకల్లు, సెప్టెంబర్‌ 10: రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతున్న సదరు విద్యార్ధి చదువు పూర్తికాకుండానే ఇంత పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం. గుంతకల్లుకు చెందిన రమేశ్, వాసవి దంపతుల కుమారుడు సాయి సాకేత్‌. పదేళ్ల కిందట వీరు అమెరికాకు వెళ్లారు. అక్కడే నివాసం ఉంటున్న వీరు తమ కుమారుడు సాయి సాకేత్‌ను అమెరికాలోనే చదివిస్తున్నారు. అక్కడ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగానే సాయిసాకేత్‌కు రూ.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువకు అర్హత సాధించాడు.

ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన ఎంపిక పరీక్షకు సాయి సాకేత్‌ కూడా హాజరయ్యాడు. ఈ పరీక్షలో సాఫ్ట్‌వేర్, బిజినెస్, గణితం విభాగాల్లో అత్యంత ప్రతిభను చూపినందుకుగానూ ఆ సంస్థ సాయి సాకేత్‌ను ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయవల్సి ఉంటుంది. దీనికి రూ.కోటి వేతనం అందుకోనున్నాడు. ఇక కోర్సు పూర్తి కాగానే ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ప్యాకేజీ ఇవ్వడానికి సదరు కంపెనీ అంగీకరించినట్లు సాకేత్ కుటుంబ సభ్యులు తెలిపారు.

సెప్టెంబర్‌ 11 నుంచి ఏపీ ఫార్మసీ మొదటి విడత కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్‌) కౌన్పెలింగ్‌కు సంబంధించిన మొదటి, రెండో విడతల షెడ్యూల్‌లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. సెప్టెంబరు 11 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 12 నుంచి 17 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్‌ 13 నుంచి 18 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు, 19న ఐచ్ఛికాల మార్పు, 21న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్‌ 21 నుంచి 23లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రెండో విడత బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌లో సెప్టెంబరు 24, 25 తేదీల్లో ఉంటుంది. 28న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబరు 8లోపు ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా