BJP vs YCP: ఏపీలో అధికార, విపక్షాల మధ్య మంటలు రేపుతున్న లిక్కర్‌ గొడవ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, విపక్ష బీజేపీ మధ్య లిక్కర్‌ గొడవ ఫీక్‌ స్టేజ్‌కు చేరుతోంది. ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని పురందేశ్వరి అంటుంటే.. ఆరోపణలు చేసేముందు ఒకటికి నాలుగు సార్లు చెక్‌ చేసుకోవాలంటూ విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇవ్వడం ఆసక్తిగా మారుతోంది.

BJP vs YCP: ఏపీలో అధికార, విపక్షాల మధ్య మంటలు రేపుతున్న లిక్కర్‌ గొడవ
Vijay Sai Reddy Purandeswari

Updated on: Oct 29, 2023 | 7:38 AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, విపక్ష బీజేపీ మధ్య లిక్కర్‌ గొడవ ఫీక్‌ స్టేజ్‌కు చేరుతోంది. ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని పురందేశ్వరి అంటుంటే.. ఆరోపణలు చేసేముందు ఒకటికి నాలుగు సార్లు చెక్‌ చేసుకోవాలంటూ విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇవ్వడం ఆసక్తిగా మారుతోంది.

ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి దూకుడు పెంచుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటినుంచి తనదైన శైలిలో వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఏపీలోని వివిధ సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. మద్యం వ్యవహారంలో వైసీపీని ఇబ్బంది పెట్టేలా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు పురందేశ్వరి. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తున్న అదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి, ఎస్పీవై అగ్రోస్ వెనుక మిధున్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం ఉందని పురందేశ్వరి చెప్పడం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.

పురందేశ్వరి వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. లిక్కర్‌ వ్యవహారంలో ఏమాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. అర్థరహిత ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదంటూ పురందేశ్వరికి వార్నింగ్‌ ఇచ్చారు విజయిసాయిరెడ్డి. .ఆరోపణలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్నారు విజయసాయిరెడ్డి.

ఇక, పురందేశ్వరిపై విజయిసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్‌ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల మాట్లాడేటప్పుడు విజయిసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లిక్కర్‌ను అడ్డం పెట్టుకుని అడ్డంగా దోసుకుంటున్నారనే కామెంట్స్‌పై సమాధానం చెప్పకుండా ఇష్టారీతిన మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు భానుప్రకాష్‌. మొత్తంగా.. లిక్కర్ వ్యవహారం ఏపీ బీజేపీ, వైసీపీ మధ్య మంటలు రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…