BJP Laxman: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అమోఘమైన భవిష్యత్.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై లక్ష్మణ్ ఆసక్తికర కామెంట్స్..

|

Jan 03, 2021 | 5:36 PM

BJP Laxman: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై బీజేపీ ఓబీసీ అఖిల భారత అధ్యక్షుడు, తెలంగాణ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

BJP Laxman: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అమోఘమైన భవిష్యత్.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై లక్ష్మణ్ ఆసక్తికర కామెంట్స్..
Follow us on

BJP Laxman: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై బీజేపీ ఓబీసీ అఖిల భారత అధ్యక్షుడు, తెలంగాణ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో బీజేపీ జెండా ఎగురుతుందని అన్నారు. ఆదివారం నాడు తిరుపతికి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అమోఘమైన భవిష్యత్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీలను ఓటు వేసే బానిసలుగానే పార్టీలు ఇప్పటి వరకు చూశాయన్న ఆయన.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఓబీసీలు, సంచార జాతులకు సరైన గుర్తింపు లభించిందని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఓబీసీల వర్గీకరణ జరగాలని అన్నారు.

మోదీ నాయకత్వంలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో బీసీలే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. సముద్ర తీర ప్రాంతాన్ని నమ్ముకున్న వారి కోసం కేంద్రంలో తొలిసారి మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. ఇదే సమయంలో సీఎం జగన్‌పై లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఏపీలో బీసీ కార్పొరేషన్లు పెట్టి తన పార్టీ నేతలకు పదువులు కట్టబెట్టిన సీఎం జగన్.. బడ్జెట్ ఎక్కడ కేటాయించారని ప్రశ్నించారు. సీఎం జగన్‌వి అన్నీ బీసీ వ్యతిరేక విధానాలే అని లక్ష్మణ్ ఆరోపించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కోత విధించడంపై బీసీలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల మద్దతుతోనే ఏపీలో కాషాయ జెండా ఎగురవేస్తుందని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Also read:

Tadipatri Clashes: రగులుతున్న తాడిపత్రి.. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష నిర్ణయం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ని ప్రత్యామ్నాయ మందుగా వాడవచ్చు, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.. సీరం మందు బెస్ట్ అని వెల్లడి