Srisailam Temple Issue: నోరు అదుపులో పెట్టకో.. లేదంటేనా.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై బీజేపీ నేత శ్రీకాంత్ ఫైర్..

|

Dec 27, 2020 | 5:20 AM

శ్రీశైల దేవస్థానంలో అన్యమతస్తుల అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీ నేతల మధ్య రచ్చ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు...

Srisailam Temple Issue: నోరు అదుపులో పెట్టకో.. లేదంటేనా.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై బీజేపీ నేత శ్రీకాంత్ ఫైర్..
Follow us on

Srisailam Temple Issue: శ్రీశైల దేవస్థానంలో అన్యమతస్తుల అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీ నేతల మధ్య రచ్చ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మహానందిలో పూజారులను తిట్టారంటూ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను పూజారులను తిట్టినట్లు ఆధారాలుంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను వెల్లడించాలన్నారు. లేదంటే చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

శనివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. ‘నీ సొంత నియోజకవర్గంలోని ఓంకార పుణ్యక్షేత్రంలో పూజారులపై ఆలయ చైర్మన్ దాడులకు పాల్పడితే ఖండించని నువ్వు హిందువుల మనోభావాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అంటూ చక్రపాణిపై విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ అవమానపరిచిన శిల్పాచక్రపాణి తన నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. లేదంటే నాలుక కోస్తానంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు శ్రీకాంత్ రెడ్డి. ఆటోలో గోమాంసం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయావంటూ చక్రపాణిపై ఘాటైన ఆరోపణలు చేశారు. ఇక షాదిఖానాకు డబ్బులు ఇచ్చిన చక్రపాణి.. ఎప్పుడైనా కళ్యాణ మండపాలకు డబ్బులు ఇచ్చరా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇదే సమయంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలో అన్యమతస్తుల పెత్తనం ఏంటో శిల్పాచక్రపాణి రెడ్డి చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం మైనార్టీల ఓటు బ్యాంక్ కోసమే ముస్లింల పట్ల కపటప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. గతంలో శిల్పామోహన్ రెడ్డి తన అన్నతో కలిసి నంద్యాలలో ముస్లింలకు చేసిన అవమానాలను మరచిపోయారా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

Also read:

Srisailam Temple: వారికి షాపుల కేటాయింపు నిజమే కానీ.. రాజాసింగ్, చక్రపాణి రెడ్డి కామెంట్స్‌పై స్పందించిన శ్రీశైలం ఈవో..

యాభై ఐదో వసంతంలోకి అడుగెడుతున్న కండల వీరుడు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్న సల్లూ భాయ్..