MLC Elections: ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి..

MLC Elections: ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..
BJP

Updated on: Feb 14, 2023 | 2:47 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నానికి పీవీఎన్‌ మాధవ్‌, కడప-అనంతపురం-కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర ను ఎంపిక చేసింది. తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కాగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 9 స్థానిక సంస్థల స్థానాలు, తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 27న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..