BJP Fires on AP DGP: తీవ్ర దుమారం రేపుతున్న ఏపీ డీజీపీ వ్యాఖ్యలు.. బీజేపీ కార్యాచరణపై ఉత్కంఠ..
ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వసం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. విగ్రహాల ధ్వసం కేసులో డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు..
BJP Fires on AP DGP: ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వసం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. విగ్రహాల ధ్వసం కేసులో డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో బీజేపీ కి చెందినవారు ఉన్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఈ మేరకు జనవరి 16న డీజీపీకి విగ్రహాల ధ్వంసం కేసులో గందరగోళ ప్రకటన చేశారని .. 20 తేదీలోగా వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆలయాలపై దాడుల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ రోజుతో గడువు ముగుస్తుండడంతో బీజేపీ నేతల కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ఎలా స్పందిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఏపీలో బీజేపీ చేపట్టనున్న రథయాత్ర కు పర్మిషన్ కోసం ఈరోజు 11 గంటలకు ఏపీ డీజీపీ ని బీజేపీ నేతలు కలవనున్నారు. కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు దేవాలయాల పరిరక్షణ రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి కోరనున్నారు. ఈ సందర్భంగా లేఖతో పాటు రూట్ మ్యాప్, సభల వివరాలను డీజీపీకి బీజేపీ బృందం సమర్పించనుంది.
Also Read: దేశంలో కొత్తగా 13వేల కేసులు నమోదు, మొత్తం కోటి దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య