
శిశిర రుతువు.. మాఘమాసం.. కృష్ణపక్షం.. ఉత్తరాయణం.. ఇవాళ్టికో ప్రత్యేకత ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా నీళ్లలో ఏవైన పత్రాలు వేస్తే.. అవి నీటిపై తేలుతుంటాయి. కాని కడలి పార్వతి కపోతేశ్వర స్వామి ఆలయంలో మాత్రం నీటిలో మునుగుతాయి. మాఘ ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. నీటిలో వేసే మారేడు దళం నీటి లోపలకు వెళ్లి కనిపించింది
ఆలయంలో ఉన్న కపోతగుండంలో మారేడు దళం పత్రానికి ఈ ప్రత్యేకత ఉంటుంది. మారేడు దళ పత్రం కపోత గుండం నుంచి నేరుగా కైలాసం శివుని దగ్గరకు చేరుతుందని భక్తుల నమ్మకం. పంచాంగం గడియల ప్రకారం ఎన్ని మాఘ ఆదివారాలు వస్తే అన్ని రోజులు ఈ ప్రత్యేకత సంతరించుకుంటుందని స్వయంభు కపోతేశ్వర స్వామి ఆలయం అర్చకులు చెప్తున్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..