YSR Congress Party: వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట.. కీలక తీర్పును వెల్లడించిన ఢిల్లీ హైకోర్టు..

YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఊరట లబించింది. ఆ పార్టీకి సంబంధించిన సింబల్ వివాదంపై ఢిల్లీ హైకోర్టు...

YSR Congress Party: వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట.. కీలక తీర్పును వెల్లడించిన ఢిల్లీ హైకోర్టు..
Ysr Congress

Updated on: Jun 04, 2021 | 6:08 PM

YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఊరట లబించింది. ఆ పార్టీకి సంబంధించిన సింబల్ వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వాస్తవానికి.. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై వివాదం నడుస్తోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. శుక్రవారం నాడు దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. వైసీపీకి ఊరటనిస్తూ తీర్పువెలువరించింది. వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు.. కొంతకాలంగా నలుగుతున్న వివాదానికి తెరదించింది.

సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్) పేరును వాడకుండా చూడాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. అలాగే.. లెటర్ హెడ్, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ప‌లు ద‌ఫాలు విచారించగా.. ముందుగా ఎన్నికల సంఘం వైఎస్సార్ అనే పేరును తమకు కేటాయించిందని, దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని బాషా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీరి అభ్యంతరాలకు కౌంటర్ ఇస్తూ వైఎస్ఆర్‌సీపీ తరఫున న్యాయవాది కూడా కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. వైఎస్సార్ పేరుపై తమకు హక్కు ఉందని కోర్టుకు వివరించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఇవాళ తీర్పును వెల్లడించింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది. తప్పుడు ఉద్దేశాలతో పిటిషన్ వేశారంటూ అన్న వైఎస్సార్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Also read:

Greek alphabets: కరోనా  ఆల్ఫా..బీటా..గామా వేరియంట్లు.. లెక్కల్లో..ఫిజిక్స్ లో కనిపించే ఈ గ్రీకు వర్ణమాల కథేమిటి?