ఏపీ ఎన్నికల్లో హాట్ సబ్జెక్ట్‌గా మారింది ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్. ప్రజల ఆస్తులు దోచుకోవడానికి తీసుకొచ్చిన యాక్ట్‌గా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అసలు అమల్లోనే లేని యాక్ట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. భూములు లాక్కుంటారని అపోహలు సృష్టిస్తున్నారని ప్రభుత్వం కూడా అంటోంది. రీనర్వే పేరుతో అధ్బుతమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం చేసిన నిర్ణయాలకు అనుగుణంగానే చట్టం తీసుకొస్తున్నామన్నారు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇంతకీ అసలు ఈ యాక్ట్ ఏంటి? ఎందుకు వివాదంగా మారింది? ప్రభుత్వం ఇస్తున్న వివరణ ఏంటి? ఇవే అంశాలపై మే 1.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..