
ఏపీలో ఎన్నికలకు సమరశంఖం పూరించాయి విపక్షాలు. కూటమి కట్టిన టీడీపీ, జనసేన.. అభ్యర్థుల తొలిజాబితా ప్రకటన తర్వాత మొదటిసారి బహిరంగసభ ఏర్పాటు చేశాయి. జెండా పేరుతో.. అజెండాను ఫిక్స్ చేసుకున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా ఇరు పార్టీల కీలకనేతలు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఈ బహిరంగసభకు.. జనసేన,టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చాయి. సభా వేదికపై పార్టీల జెండాలు మార్చుకుని… చేతులు కలిపి అభివాదం చేస్తూ… కార్యకర్తల్లో జోష్ నింపారు ఇద్దరు అగ్రనేతలు. జెండా సభ తర్వాత.. కూటమి ఎన్నికల అజెండాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే, ఎన్నికలకు సిద్ధం అంటూ వైసీపీ సవాల్ చేస్తోంది.. ఇప్పటికే సీఎం జగన్ క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈ తరుణంలో.. క్యాడర్‌కు జగన్ ఇచ్చిన అస్త్రాలు పనిచేస్తాయా? .. ఎన్నికలకు సిద్ధం అంటూ.. క్యాడర్‌కు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన అస్త్రాలు పనిచేస్తాయా? ఎత్తరజెండా అంటున్న తెలుగుసేన! కూటమి సీట్ల సర్దు.. పోట్లతో ఓట్లబదిలీ జరిగేనా?.. అనే అంశాలపై జరిగే.. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ లో వీక్షించండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..