Andhra Pradesh: ఏపీలో దుమారంరేపుతోన్న ఓట్ల తొలగింపు వ్యవహారం.. ఒకరిపై మరొకరు..

|

Aug 22, 2023 | 9:39 PM

ఈ నేపథ్యంలోనే అటు ఓటర్ల జాబితాలపై పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. మరోవైపు తమ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు అవుతున్నాయంటున్నాయి విపక్షాలు. తమ ఓట్లే కనిపించడం లేదంటోంది వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా పరస్పర ఫిర్యాదులు.. ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరొక్కసారి హీటెక్కాయి. ఓటర్ల జాబితాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటోంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్న టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం...

Andhra Pradesh: ఏపీలో దుమారంరేపుతోన్న ఓట్ల తొలగింపు వ్యవహారం.. ఒకరిపై మరొకరు..
Andhra Pradesh
Follow us on

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటర్ల జాబితాలపై ఫోకస్ పెట్టిన విపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేశాయి. ప్రభుత్వం ఓట్లు తొలగిస్తూ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ, బీజేపీ ఆరోపిస్తుంటే.. జాబితాల్లో తమ ఓట్లే గల్లంతవుతున్నాయని వైసీపీ అంటోంది. మొత్తానికి వరుస ఫిర్యాదులతో ఎన్నికల సంఘం వద్దకు క్యూ కడుతున్నారు ఏపీలోని ప్రధాన పార్టీల నేతలు.

ఈ నేపథ్యంలోనే అటు ఓటర్ల జాబితాలపై పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. మరోవైపు తమ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు అవుతున్నాయంటున్నాయి విపక్షాలు. తమ ఓట్లే కనిపించడం లేదంటోంది వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా పరస్పర ఫిర్యాదులు.. ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరొక్కసారి హీటెక్కాయి. ఓటర్ల జాబితాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటోంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్న టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తేల్చుకుంటామంటున్నారు. ఈనెల 28న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు.

మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ దొంగ ఓట్లను నమ్ముకుందని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పదివేల దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బూత్‌ స్థాయిలో ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలని పార్టీ నాయకులకు సూచించారు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. చంద్రబాబు హయాంలో లక్షల దొంగ ఓట్లు నమోదు చేశారనే ఆరోపణలు వున్నాయని.

ఇవి కూడా చదవండి

వీటిని గుర్తించి ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని వైసీపీ తమ కేడర్‌కు చెబుతోంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఓట్లు గల్లంతు అయ్యాయని వీటిపై సమగ్ర విచారణ జరిపించాలంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఓటర్ల జాబితా చుట్టూ తిరుగుతున్నాయి. జాబితాల్లో అక్కడక్కడా అక్రమాలు నిజమేనని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి చర్యలు కూడా తీసుకుంటోంది. మరీ ఇందులో ఏ పార్టీకి అనుకూలంగా ఉల్లంఘనలు జరిగాయో? ఎవరు తేల్చాలి? ఇదే అంశంపై బిగ్‌ న్యూస్‌ డిబేట్‌.

బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌ వీడియో..

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..