Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో పేదలెవరు? పెత్తందారులెవరు? ఆ వ్యూహం అందుకేనా..

|

Feb 20, 2024 | 8:49 PM

Big News Big Debate: పెత్తందారులు, పేదలు.. చాలారోజులుగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట ఇది. ఇప్పుడిదే అంశం.. రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారుబోతున్నట్టు కనిపిస్తోంది. ఇదే నినాదంతో దూసుకెళ్తున్న అధికార వైసీపీ.. అందుకు తగ్గట్టుగానే చాలాచోట్ల బీసీలకు సీట్లు ఖరారుచేస్తోంది. మరి, రూలింగ్‌ పార్టీ యాక్షన్‌కు విపక్షాల రియాక్షన్‌ ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈసారి పెత్తందారులతో పేదలకు యుద్ధం జరగబోతోందంటూ… ప్రతీసభలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. అందుకు తగ్గట్టే బీసీ స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పలు ఎంపీ, ఎమ్మెల్యే సిట్టింగ్‌ స్థానాల్లో… అగ్రవర్ణ నేతలను కాదని బీసీలకు అవకాశం ఇవ్వడమే దీనికి నిదర్శనం.

ఇప్పటికే 60కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చేసిన వైసీపీ… వాటిలో కొన్నింటిని బీసీ నాయకులకు కేటాయించింది. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీని కాదని.. ఆయన స్థానంలో బొత్స ఝాన్సీని బరిలో దింపుతోంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయల స్థానంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను పోటీకి పెడుతోంది. వైసీపీ నేతలు సైతం.. తమ నాయకుడు పైరవీకారులకు, కార్పొరేట్లకు టిక్కెట్లివ్వరనీ.. వైట్‌ రేషన్‌ కార్డున్న పేదలనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారనీ చెప్పుకొస్తున్నారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

కొన్నాళ్ల క్రితం వైసీపీని వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సొంతగూటికి చేరుకున్నారు. సీఎం జగన్‌ కలిసిన ఆయన… మంగళగిరిలో బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. పేదలకు మంచి జరుగుతుంటే విపక్షాలకు మింగుడు పడట్లేదని ఆరోపించారు.

తమ అభ్యర్థులంతా నిరుపేదలే అంటున్న వైసీపీ… ప్రత్యర్థి పార్టీల నుంచి పెత్తందారులే అంటోంది. మరి, వైసీపీ వేసిన ఈ బీసీ వ్యూహానికి… జనసేన, టీడీపీల కౌంటర్‌ స్ట్రాటజీ ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జయహో బీసీ పేరిట సభలు నిర్వహిస్తున్న టీడీపీ… వైసీపీ దూకుడును అడ్డుకునేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..