Big News Big Debate: ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి ప్రధానపార్టీలు. ఇంతకాలం పథకాలు.. ప్రజలకు సంక్షేమంపై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జగన్ ఇక అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్న సిట్టింగులను పక్కనపెట్టి.. గెలిచేవారికే సీటు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం జగన్మోహన్‌రెడ్డి. గడిసిన కొద్దిరోజులుగా మార్పు- చేర్పులతో పార్టీలో అలజడి మొదలైంది. మూడు నెలల ముందే వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వీఆర్ఎస్ ఇస్తున్నారని విపక్షాలు అంటే.. వై నాట్ 175లక్ష్యంగానే ఛేంజస్ ఉన్నాయంటోంది అధికారపార్టీ.
అధికార వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్ లను మార్చిన అధిష్టానం… తాజాగా మరికొందరిని తాడేపల్లి పిలిచిమరీ భవిష్యత్తుపై స్పష్టత ఇస్తోంది. గడిచిన రెండు రోజులుగా 20మందికి పైగా నేతలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. సర్వేల ఆధారంగా కొందరికి టికెట్ ఇవ్వడం నిరాకరిస్తోంది పార్టీ. మరికొందిరికి స్థానచలనం తప్పడం లేదు. తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి ఎంపీగా బరిలో దింపాలని నిర్ణయించారు సీఎం జగన్.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఎమ్మెల్యేలను మారుస్తున్నారంటున్నాయి విపక్షాలు. ఎంతమందిని మార్చినా వైసీపీకి అధికారంలోకి రాదంటోంది టీడీపీ. వ్యతిరేకత ఎమ్మెల్యేలపై కాదని.. సీఎం జగన్ పట్ల జనాలు విసిగిపోయారంటోంది తెలుగుదేశం పార్టీ.
తమకు టికెట్లు రావంటూ కొందరు ప్రచారం చేస్తే ఆనందపడుతున్నారని.. తమకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జగనన్న సైనికురాలుగా ఉంటామన్నారు మంత్రి రోజా.
వై నాట్ 175 అంటున్న అధికారపార్టీ కీలక నియోజకవర్గాల్లో కూడా మార్పులకు సిద్ధమవుతోంది. కొత్త ప్రయోగాలతో గెలుపు లక్ష్యంగా తాడేపల్లిలో మంత్రాంగం జరుగుతోంది. భారీ మార్పులతో అధికారం మళ్లీ దక్కుతుందా? లేక బూమరాంగ్ అవుతుందా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..