Chandrababu Case: భిన్న తీర్పులు.. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. నెక్స్ట్ ఏంటి..?

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తనపై దాఖలు చేసిన FIR కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే సెక్షన్‌ 17Aకి సంబంధించిన వివరణపై ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు వెలువరించారు. తనపై దాఖలైన FIR కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు.

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తనపై దాఖలు చేసిన FIR కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే సెక్షన్‌ 17Aకి సంబంధించిన వివరణపై ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు వెలువరించారు. తనపై దాఖలైన FIR కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. స్కిల్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-A వివరణపై ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది వేర్వేరు తీర్పులు ఇచ్చారు. దీంతో ఈ కేసును ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు.

చంద్రబాబు కేసులో సెక్షన్ 17-A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. ఆయనపై కేసుల విషయంలో ముందుకు వెళ్లేందుకు గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని అన్నారు. అయితే ఇప్పుడైనా ఈ అనుమతి తీసుకోవచ్చని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద విచారణ చేయడం తగదన్నారు. అయితే రిమాండ్ ఆర్డర్‌ చెల్లుబాటు కాదనడం సబబు కాదని స్పష్టం చేశారు.

ఈ కేసులో మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది తీర్పు మరో రకంగా ఉంది. సెక్షన్‌ 17A అన్నది 2018లో చేసిన సవరణతో వచ్చిందని, అంతకు ముందు కేసులకు దీనిని వర్తింపజేయడం కుదరదని అన్నారు. సెక్షన్‌ 17A అనేది నిజాయితీపరులైన ప్రజా సేవకులను కాపాడేందుకేననని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ స్పందించింది. సెక్షన్‌ 17-Aపై న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. చంద్రబాబును రిమాండ్ తీసుకోవడం తప్పు కాదని, విచారణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని సుప్రీంకోర్టు చెప్పిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు

మరోవైపు ఈ తీర్పును పాక్షిక విజయంగా అభివర్ణించింది టీడీపీ. సీజే బెంచ్‌లో న్యాయం తమకు న్యాయం జరుగుతుందని తెలిపింది. మొత్తానికి ఈ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును టీడీపీ, వైసీపీలు ఎవరికీ వారే తమకు అనుకూలంగా చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..