Vijayawada: కృష్ఢా నదిలో పది కేజీల చేపల వరకూ పెరుగుతుంటాయి. సాధారణంగా బొమ్మిడాయిలు, కొర్రమీను, బొచ్చ వంటి రకాలే నది నీళ్ళలో పెరుగుతుంటాయి. సముద్రంలో పెరిగే చేపలు నది నీటిలో పెరగవు. టేకు రకం చేపలు సముద్రంలో ఎక్కువుగా దొరుకుతాయి. భారీ సైజులోని టేకు చేపలు సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార వలలకు పడతాయి. రెండు, మూడు వందల కేజీలుండే టేకు చేపలో సముద్రంలోనే పెరుగుతుంటాయి. అయితే దాచేపల్లి మండలం తంగెడ వద్ద కృష్ణానదిలో రెండు వందల కేజీల టేకు చేప మత్స్యకారుల వలలకు చిక్కింది. భారీ చేప చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి టేకును పట్టుకున్నట్లు జాన్. అనే మత్య్సకారుడు తెలిపాడు. దాదాపు మూడు వలలు కూడా పాడయ్యాయన్నారు. ఇరవై వేల రూపాయల ధర పలికిందన్నారు. భారీ టేకు చేపలు నదిలో దొరకటం అరుదగా జరుగుతుంటుందన్నారు.
టి. నాగరాజు, టీవీ9 రిపోర్టర్, గుంటూరు
Also read:
Ludhiana Blast: పంజాబ్‌లోని లూథియానా కోర్టులో పేలుడు.. ఇద్దరు మృతి..!
Year Ender 2021: ఒలింపిక్స్ నుంచి టీ20 ప్రపంచకప్ వరకు.. ప్రపంచ క్రీడల్లో కీలక ఘట్టాలు..!