
భోగాపురంలో తొలి ఫ్లైట్ సోమవారం ఉదయం 6.45కి ల్యాండ్ అయ్యింది. ల్యాండైన తొలి ఫ్లైట్‌కి వాటర్ సెల్యూట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్ దే ఫస్ట్ ఫ్లైట్. ఇందులో వచ్చిన ప్రయాణికులకు ఘన స్వాగతం లభించింది. వారికి ఏటికొప్పాక బొమ్మలను గిఫ్ట్‌గా ఇవ్వడంతో.. ఆ ప్రయాణికులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో చివరి సర్వీస్ ఆదివారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఢిల్లీకి వెళ్లింది. ఇక ఈ ఎయిర్ పోర్ట్ నుంచి లాస్ట్ సర్వీస్ వెళ్లడంతో అక్కడ సెండాఫ్ వేడుకలు చేసుకున్నారు. అక్కడ పనిచేసే వారందరికీ APATA సభ్యులు స్వీట్ ప్యాకెట్స్ ఇచ్చారు. సో.. ఒక్క రోజులోనే.. విమాన సర్వీసులు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కొద్ది రోజుల కిందట ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఆ తరువాత సోమవారం నుంచి సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇక విశాఖ విమానాశ్రయం నుంచి పౌర విమాన సేవలకు అవకాశం లేనట్టే. అన్ని సర్వీసులూ భోగాపురం నుంచే ఆపరేట్ అవుతాయి. భోగాపురానికి వచ్చిన ఫ్లైట్ అయితే సోమవారం వచ్చింది కానీ.. భోగాపురం నుంచి వెళ్లిన ఫ్లైట్ సంగతి చూస్తే.. ఆదివారం అర్థరాత్రే.. సింగపూర్ కు వెళ్లింది. సో.....