భారతమాతపై ప్రేమతో తాపీ మేస్త్రి చేసిన పనికి ప్రశంసల వర్షం.. ఏం చేశారంటే?

ప్రతి జీవికి జన్మ నిచ్చేదీ తల్లి. నవమాసాలు మోసి.. ఆమె ఎన్నో కష్టాలకు ఓర్చి బిడ్డకు జన్మనిస్తుంది. ఆమెతో సమానంగా దేశాన్ని భారతీయులమైన మనం తల్లితో పోల్చుకుని ఆరాధిస్తాము. మనకు మన దేశం భారతమాత. ఇక్కడ ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డా భారతీయుడే. ఆమెకు 25 ఏళ్ళ క్రితమే ఆలయాన్ని నిర్మించి సేవలు అందిస్తున్నారు వడ్డి సుబ్బారావు.

భారతమాతపై ప్రేమతో తాపీ మేస్త్రి చేసిన పనికి ప్రశంసల వర్షం.. ఏం చేశారంటే?
Bharat Mata Temple

Edited By: Balaraju Goud

Updated on: Aug 15, 2025 | 12:15 PM

ప్రతి జీవికి జన్మ నిచ్చేదీ తల్లి. నవమాసాలు మోసి.. ఆమె ఎన్నో కష్టాలకు ఓర్చి బిడ్డకు జన్మనిస్తుంది. ఆమెతో సమానంగా దేశాన్ని భారతీయులమైన మనం తల్లితో పోల్చుకుని ఆరాధిస్తాము. మనకు మన దేశం భారతమాత. ఇక్కడ ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డా భారతీయుడే. ఆమెకు 25 ఏళ్ళ క్రితమే ఆలయాన్ని నిర్మించి సేవలు అందిస్తున్నారు వడ్డి సుబ్బారావు.

సాధారణంగా దేవతలకు ఆలయాలు నిర్మిస్తారు. భారతీయులు భారతమాతను దేవతగా ఆరాధిస్తారు. దేశభక్తితో భారత మాతను కొలుస్తారు. అందుకు నిదర్శనంగా వడ్డి సుబ్బారావు భారతమాతకు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం ఉత్తరపాలెంకు చెందిన వడ్డి సుబ్బారావు తాపీ మేస్త్రీ. స్వాతంత్ర భారత స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని స్మారక చిహ్నాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనతో ప్రేరణ పొందిన వడ్డి సుబ్బారావు 1999లో నవుడూరు జంక్షన్‌లో నేషనల్ ఫ్లాగ్ టవర్ స్వయంగా నిర్మించి, అందులో భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటిలోనే ఈ నిర్మాణానికి రెండు లక్షలు ఖర్చు చేశారు సుబ్బారావు.

ఫ్లాగ్ టవర్ సమీపంలో దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలకు వచ్చిన వారు ఫ్లాగ్ టవర్ వద్దకు వచ్చి భారత మాతకు పూజలు చేస్తుంటారు. ఫ్లాగ్ టవర్ సమీపంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద , అబ్దుల్ కలాం, బిపిన్ రావత్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి చేరుకోగానే భారతీయులు తమ స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాల స్ఫూర్తి కనిపిస్తుంది. దేశభక్తితో భారత మాతకు జై అంటారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలను నేషనల్ ఫ్లాగ్ టవర్ వద్ద జరిపి భారత మాతకు పూజలు చేస్తున్నారు స్థానికులు. దేశభక్తిని పెంపెందించే విధంగా ఆలయాన్ని నిర్మించిన తాపీ మేస్త్రీ సుబ్బారావు కృషి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..