Coronavirus Pandemic : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్.. అక్కడ మాస్కులు లేకుండా తిరిగారో పోలీసులకు ఫైన్ కట్టాల్సిందే…!

|

Mar 22, 2021 | 12:00 PM

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో అల్లకల్లోలం సృష్టిస్తూనే ఉంది. 18 నెలలు అయినా.. ఇంకా అదుపులోకి రాకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. అయితే ఓ వైపు...

Coronavirus Pandemic : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్.. అక్కడ మాస్కులు లేకుండా తిరిగారో పోలీసులకు ఫైన్ కట్టాల్సిందే...!
Ap Police
Follow us on

Coronavirus Pandemic : చైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో అల్లకల్లోలం సృష్టిస్తూనే ఉంది. 18 నెలలు అయినా.. ఇంకా అదుపులోకి రాకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. అయితే ఓ వైపు వ్యాక్సిన్ దశలవారీగా ఇస్తూనే ఉన్నారు.. మరోవైపు దేశంలో మూడు రోజులుగా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలు మరింత అప్రమత్తమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పోలీసులు ప్రజలను కోరారు.

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు తమ విచక్షణా అధికారాన్ని ఉపయోగించి కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.. ఆలా మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికీ జరిమానా విధించబడును అని చెప్పారు.. ఈ మేరకు గ్రామాల్లో మాస్క్ ధరించకుండా తిరిగిన వారికి రూ.500, పట్టణాలలో అయితే రూ.1000 జరిమానా వేయనున్నారు.. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు జరిమానా పుస్తకాలను అందుకున్నారు. ఈ నేపాధ్యంలో కరోనా నివారణ కోసం అందరూ మస్కులు తప్పనిసరిగా ధరించి మీ ఆరోగ్యం మరియు ఇతరుల ఆరోగ్యానికి దోహదపడండని కోరారు.. అయితే మాస్కులు లేకపోతె జరిమానా అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు.. పోలీసులు తీసుకున్నదని తెలుస్తోంది.

Also Read: జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్లో నలుగురు టెర్రరిస్టుల మృతి, పరారైన ఉగ్రవాదులకోసం గాలింపు

Suma Kanakala Birthday: కేరళలో పుట్టి.. తెలుగింటి ఆడబడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న క్వీన్ ఆఫ్ యాంకర్స్