MP Nandigam Suresh slams RRR : ఆర్ఆర్ఆర్ పై విరుచుకుపడ్డ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌

|

Mar 19, 2021 | 9:40 PM

MP Nandigam Suresh slams RRR : నరసాపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అదే పార్టీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తీవ్ర స్థాయిలో..

MP Nandigam Suresh slams RRR : ఆర్ఆర్ఆర్ పై విరుచుకుపడ్డ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌
Bapatla MP Nandigam Suresh Slams RRR
Follow us on

MP Nandigam Suresh slams RRR : నరసాపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అదే పార్టీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ ఎంపీ రఘురామరాజుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెట్టు కింద కూర్చుని పిట్ట కధలు చెప్పడం కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏమున్నాయో తెలియని రఘురామకృష్ణంరాజు. అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో తిరిగే ధైర్యం కూడా లేదు.. ఇంకా ఢిల్లీలోనే మకాం వేసిన రఘురామకృష్ణంరాజు అంటూ విమర్శించారు. దళితుల సమస్యను ఎమ్మెల్యే ఆర్‌కె వినకూడదని ఎక్కడైనా ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించిన నందిగం.. దళితులు వ్యతిరేకిస్తారనే రఘురామరాజు నరసాపురం వెళ్లడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు.. నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. నందిగం ప్రెస్ మీట్ పూర్తి పాఠం ఇదీ..

ఏది ఎక్కడుందో కూడా తెలియదు:
‘రాజధాని ప్రాంతంలో పెనుమాక, ఉండవల్లి, ఎర్రబాలెం, మంగళగిరి మొత్తం సీఆర్డీఏ పరిధిలోనే ఉంది. అంటే మంగళగిరి కూడా రాజధాని ప్రాంతంలోనే ఉంది. అది తెలుసుకోకుండా ఆ ప్రాంతం రాజధాని కాదు, అసలు సంబంధమే లేదని మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజును చూస్తుంటే జాలి వేస్తుంది. ఒక ఎంపీగా ఉండి కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏమోన్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు ఉన్నారు’.

చెట్టు కింద కూర్చుని..!:
‘సొంత నియోజకవర్గం పరిధిలో తిరిగే దమ్ము, ధైర్యం లేక చివరకు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. చేసిన తప్పుల వలన అడ్డదారుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని ఢిల్లీకే పరిమితం అయ్యారు. చెట్టు కింద కుర్చొని రచ్చబండ అని, విగ్గుబండ అని, పెగ్గుబండ అని మాట్లాడుతున్నారు’.

నీ క్యారెక్టర్‌ ఏమిటి?:
‘రఘురామకృష్ణంరాజు ఒక డబ్బా, పేక ముక్కలు కొనుక్కుని చిలుక జోస్యం చెప్పుకోవచ్చు. టీడీపీ జ్యోతిష్యం, వాళ్ల జ్యోతిష్యం అని చెబుతున్నావు. అయితే ముందు నీ బతుకు తెలుసుకో. నీ జాతకం ఏంటో తెలుసుకో. అసలు నీ భవిష్యత్‌ ఏంటో ఒక్కసారి ప్రశ్నించుకో. ఎవరెవరో బ్రతుకుల గురించి మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజు అసలు నీ క్యారెక్టర్‌ ఏమిటి? ఏం చేయడం వల్ల నీవు నర్సాపురం పార్లమెంటు నియోజవర్గాన్ని వదిలి ఢిల్లీకి పరిమితం అయ్యావు?’.

ఎమ్మెల్యే ఆర్కే వినకూడదా?:
‘దళితులు దళితులుతోనే మాట్లాడుకోవాలి, మేం ఎవరితో మాట్లాడకూడదన్నది రఘురామకృష్ణంరాజు ఆలోచన. ఎమ్మెల్యే ఆర్కే దగ్గరకు దళితులు ఎలా వెళ్తున్నారు?. అయన పేరు చివర రెడ్డి ఉంది కాబట్టే దళితులు ఆయన దగ్గరకు వెళ్లారా?. అని రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి మాత్రమే సమస్య చెప్పుకోవాలంటే ఎలా?. అంటే దళితులు కేవలం దళితులుతోనే సమస్యలు చెప్పుకోవాలంటే, మేము ఎవరితోనూ మాట్లాడకూడదనే నీ ఆలోచన. అసలు రఘురామకృష్ణంరాజుకు మానవత్వం ఉందా? అటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? దళితులు అనే వారు పక్క ఎమ్మెల్యేలతో సమస్య చెప్పుకోకూడదా? ఎమ్మెల్యే ఆర్కే దళితుల సమస్యలు వినకూడదని ఎక్కడైనా రాసి ఉందా? ఎమ్మెల్యేకు ఒక పరిధి కేటాయించడానికి మీకేం హక్కులు ఉన్నాయి?’.

నీకేం హక్కులు వచ్చాయి?.:
‘ఎమ్మెల్యేకు ఏం హక్కులు ఉన్నాయని మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజు ఒక ఎంపీగా రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ తరపున గెల్చారు. మరి ఆయనకు కొత్తగా ఏం హక్కులు వచ్చాయి?. స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి వారి సమస్య చెప్పుకుంటే బ్యాక్‌ డేట్‌ వేసి తీసుకెళ్లారంటా, అది ఒక షాకింగ్‌ న్యూస్‌ అంటారా! నీలాంటి చొట్ట చెంబు మొఖం వారు మాట్లాడితే అక్కడ లెక్కేసుకునే పరిస్థితి లేదు. ఒక్క సారి నీ గురించి ఆలోచించుకో రఘురామకృష్ణంరాజు. నువ్వు పెద్ద వీరుడు, తోపు అనుకుంటున్నావా?. నీది చిలుక జ్యోతిష్యం అని రాష్ట్ర ప్రజలు తేల్చేశారు’.

అక్కడ అడుగు పెట్టే ధైర్యం లేదు:
‘దళితులు వ్యతిరేకిస్తారనే స్టే వచ్చిన సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి భయం. ఏపీలోకి అడుగుపెట్టే దమ్ము, ధైర్యం లేదు. సొంత నియోజకవర్గానికి వెళ్లే అవకాశాన్ని కోర్టు ఇచ్చినా వెళ్లిపోకుండా ఇంకా ఢిల్లీలోనే ఏడుస్తున్నావెందుకు?. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని మాట్లాడావు కాబట్టే దళిత సంఘాలంటే నీకు భయం. నీవు వెళ్తే దళితులు వ్యతిరేకిస్తారన్న ఆందోళన. పతనానికి ముందు గర్వం నడుస్తుందని మాట్లాడుతున్న రఘరామకృష్ణంరాజుకు కచ్చితంగా అదే నడుస్తుంది. భవిష్యత్‌ లో చూస్తావు, ఇలాంటివి అన్నీ నీకు వర్తిస్తాయి’.

రాజ్యాంగ విరుద్ధ పనులు:
‘రాజ్యాంగాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణంరాజు, రాజ్యాంగాన్ని పరిరక్షించే రాష్ట్రపతి దగ్గరకు వక్రమార్గంలో ఇష్టానుసారం ప్రవర్తించి రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ విరుద్ధ పనులు అమలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి రఘురామకృష్ణంరాజు ఒక పార్టీ నుంచి గెల్చి, ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. మా పార్టీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధం. అలాగే అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయకూడదని తెలిసి ఆ భూములు మీరు కొంటే రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసైన్డ్‌ భూముల మీద జీవో నెం.41 తీసుకువచ్చారు. ఇంకా 2013 తర్వాత కొనుగోలు భూములన్నీ సక్రమమే అని చెప్తే అది వక్రీకరణ’.

రాజకీయ వ్యభిచార బినామీ:
‘అపర మేధావినని చెట్టు కింద కుర్చొని పిట్ట కథలు చెప్పడం సులువే. దళితుల సమస్యలు తెలుసుకుని మాట్లాడు. చంద్రబాబు తప్పు చేయలేదని మాట్లాడుతున్నావు. తప్పు చేయనపుడు నువ్వు, నీ పార్టనర్‌ కలిసి రాజకీయ వ్యభిచారానికి బినామీగా మారి, చంద్రబాబు తొత్తుగా మారి, రాజకీయ వ్యభిచార బినామీ లాంటి దుర్మార్గుడివి నువ్వు. రాజ్యాంగం గురించి, అసైన్డ్‌ భూములు గురించి మాట్లాడుతున్నావు’.

స్థాయి పెంచిన మహానుభావుడు:
‘అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి పి.నారాయణకు ఏం సంబంధం అని రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంతో నారాయణకు సంబంధ లేదని మాట్లాడుతున్నావంటే.. వైయస్‌ఆర్‌ సీపీలో కాదు టీడీపీలో గెలిచాను అని చెప్పగలవు.. నారాయణకు, ఇంకొకరకు సంబంధం లేదని మాట్లాడుతున్నావు. కానీ సంబంధం ఉన్న వ్యక్తులు అందరూ నాకు తెలుసు. మేం అక్కడే ఉన్నాం, ఆ ప్రాంతంలోనే ఉన్నాం, ఆ ప్రాంతంలోనే అవమానించబడ్డాము. నిజానికి ఆ ప్రాంతంలో దేహి అని అడుక్కునే పరిస్థితి నుంచి డిమాండ్‌ చేసి మా పనుల్ని మేమే చేసుకునే పరిస్థితి కల్పించిన మహానుభావుడు శ్రీ వైయస్‌ జగన్‌. కానీ మీరు దేహి అని చెప్పి అడుక్కునే వారిలా మమ్మల్ని దీనంగా చూశారు’.

స్టేలు తెచ్చుకోవడం దమ్ము కాదు:
‘అదే రాజధాని ప్రాంతంలో మీ దాయాదులందరూ అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో నీకు వాటాలున్నాయా? అక్కడ నీవు ఒక పార్టనర్‌గా పని చేస్తున్నవా అని అనుమానం కలుగుతుంది. చంద్రబాబు పాపాలు నువ్వు కూడా పంచుకున్నావా? భూములు కొల్లగొట్టిన దాంట్లో నీ పాత్ర కూడా ఏమైనా ఉందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. తప్పు చేయనపుడు చంద్రబాబు కానీ, ఆయన పెంపుడు కొడుకైనా కానీ, ఢిల్లీలో ఉన్న నువ్వు కానీ, ఇంకెవరైనా కానీ కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం దమ్ము కాదు. ధైర్యంగా కేసులు ఎదుర్కొని, నిలబడి, గెల్చి తప్పు చేయలేదని నిర్ధారణ అయినపుడు మాత్రమే మగాడివని చెప్పుకుంటారు’.

విలువలు ఉంటే రాజీనామా చేయి:
‘ఎంపీ రఘురామకృష్ణంరాజు పర్మినెంట్‌గా ఆ చెట్టు కింద పిట్ట కథలు చెప్పడానికి తప్ప దేనికీ పనికిరాడు. ఎల్లో మీడియాతో పాటు తనాతందనా అంటూ బుర్రకథలు చెప్పుకోవడానికి తప్ప మరో దానికి పనికిరాడు. నీలాంటి పనికిమాలిన సన్నాసులు భవిష్యత్‌ లో ఎక్కడ ఉండాలో, అక్కడ ఉంటారు. తప్పకుండా చూస్తారు. ఇప్పటి వరకు పార్టీ మారావా? లేదా? నిర్ధారణ చెయ్యవు. ఏ పార్టీలో గెలిచి ఎవరికి ససోర్ట్‌ చేస్తున్నావో చెప్పవు. కాబట్టి నీలాంటి వారి మాటలకు విలువ ఉండదు. నీకు నైతికంగా విలువలు ఉంటే గెలిచిన పార్టీ నుంచి రాజీనామా చేసి పక్కకు వెళ్లిపోవాలి. ఉన్నపళంగా రాజీనామా చేసి చంద్రబాబును అడిగి టీడీపీ నుంచి సీటు తెచ్చుకుని గెలువు. అప్పుడు నువ్వు తోపు అని నేనే అంటా.. మాపార్టీ తరుపున గెలిచి మామీదే ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలితే చూస్తూ కుర్చోబోము’.. అని ప్రెస్‌మీట్‌లో ఎంపీ నందిగం సురేష్‌ తేల్చి చెప్పారు.

Nandigam On Rrr

Read also : YS Sharmila : చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ, పార్టీ విధి విధానాలపై అక్కడే ప్రకటన : జిల్లా నేతలతో వైఎస్ షర్మిల