Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?

సంక్రాంతి సందర్భంగా బాపట్ల జిల్లా యర్రంవారిపాలెంలో జరిగిన వినూత్న రివర్స్ ట్రాక్టర్ డ్రైవింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ పందాలకు భిన్నంగా జరిగిన ఈ పోటీల్లో డ్రైవర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కీర్తిశేషులు యర్రం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించారు. గ్రామస్తులు ఉత్సాహంగా తిలకించిన ఈ పందెం, డ్రైవింగ్ మెలకువలకు కొత్త నిర్వచనం ఇచ్చింది.

Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?
Tractor Reverse Driving Competition

Edited By:

Updated on: Jan 14, 2026 | 9:56 PM

పల్లెటూర్లలో పండగలప్పుడు బరువులు ఎత్తడం, తాడు లాగడం, కొబ్బరికాయ విసరడం వంటి పందాలు నిర్వహిస్తూ ఉంటారు .అలానే ఎడ్లతో బండలు లాగించడం, పరిగెత్తించడం వంటి పందేల చూస్తూ ఉంటాం.. ఇక గుర్రాల రేసులు, బైక్ రేసులు, కార్ రేసులు కూడా సిటీల్లో చూస్తూ ఉంటాం. ఇలా పందేలు ఏవి చూసినా ముందుకు వెళ్లడమే టార్గెట్. బైక్స్, కార్ రేసింగ్స్ ఏవైనా ఆయా వాహనాలు మంచి కండీషన్‌లో ఉంటే ముందకు ఎవరైనా నడిపిస్తారు. కానీ రివర్స్ నడపడం అంటే.. అదీ కూడా సెలెక్టెడ్ లైన్ల మధ్య వేగంగా నడపడం అంటే మామూలు విషయమా.. దానికి అనుభవంతో పాటు మంచి స్కిల్ కూడా అవసరం.

టాక్టర్ రివర్స్ డ్రైవింగ్ పోటీలు

అయితే బాపట్ల జిల్లా కారంచేడు మండలం యర్రంవారిపాలెం గ్రామంలో సారి అన్నింటికి బిన్నంగా ట్రాక్టర్ రివర్స్ డ్రైవింగ్ పోటీలు నిర్వహించారు. యర్రంవారిపాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్, కీర్తి శేషులు యర్రం వెంకటరెడ్డి జ్ఞాపకార్ధం గ్రామంలో రివర్స్ ట్రాక్టర్ డ్రైవింగ్ పోటీలను ఒంగోలు పార్లమెంట్ వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి జెండాను ఊపి ప్రారంబించారు.

పోటీ రూల్స్ ఏంటంటే. 

ముగ్గులతో గీసిన గీతలను దాటకుండా, ఒక్క నిమిషంలో రివర్స్ ఎక్కువ దూరం ఎవ్వరు నడిపితే వాళ్లు గెలిచనట్లు లెక్క . విన్నర్స్‌కు ఫస్టు ప్రైజు 6 వేలు, సెకండ్ ప్రైజ్‌4 వేలు, థర్డ్ ప్రైజ్‌ 2 వేలు ఇస్తున్నారు. దీంతో గ్రామంలో ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లు  తెగ పోటీ పడ్డారు. చాలామంది గీతలు తొక్కి ఔట్ అయిపోయారు. కొద్ది మంది మాత్రమే ఈ పోటీలో విజేతలుగా నిలిచారు.

విజేతలు వీరే

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు గ్రామస్తులు బహుమతులు అందించారు. ట్రాక్టర్ రివర్స్ డ్రైవింగ్లో గ్రామానికి చెందిన యర్రం దశరధరామిరెడ్డి ప్రధమ స్తానం, చిమటా ఇమ్మానుయేలు ద్వితీయ స్తానం, వరికూటి కోటిరెడ్డిలు తృతీయ స్థానాలు సాదించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థులు ఆశక్తిగా తిలకించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.