AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: తన పుట్టిన రోజున నాడు సుబ్బారెడ్డి పాలెం వాసులకు వినూత్న గిఫ్ట్ ఇచ్చిన బాపట్ల ఎమ్మెల్యే!

ఎన్నికల్లో ఇచ్చిన హామీని తన సొంత డబ్బుతో అమలు చేసిన ఓ ఎమ్మెల్యే ప్రజల అభినందలు పొందారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గత ఎన్నికల సమయంలో సుబ్బారెడ్డి పాలెం గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు తన సొంత డబ్బుతో వంతెనను కట్టించారు. అది పూర్తయ్యే నాటికి ఆయన జన్మదినం కూడా రావడంతో.. అదే రోజు వంతెనను ప్రారంభించి సుబ్బారెడ్డి పాలెం ప్రజలకు తన పుట్టిన రోజు గిఫ్ట్‌గా అందజేశారు.

Andhra News: తన పుట్టిన రోజున నాడు సుబ్బారెడ్డి పాలెం వాసులకు వినూత్న గిఫ్ట్ ఇచ్చిన బాపట్ల ఎమ్మెల్యే!
Mla Narendra Varma
T Nagaraju
| Edited By: |

Updated on: May 24, 2025 | 7:26 PM

Share

బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గత ఎన్నికల సమయంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆయన సుబ్బారెడ్డి పాలెం వెళ్లారు. అయితే వెస్ట్ బాపట్ల చానల్ పై వంతెన లేకపోవడంతో  తామంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు ఆయన ద్రుష్టికి తీసుకొచ్చారు. తాటి మొద్దులు పైనే తాము కాలువ దాటుతున్నట్లు ఆయనకు చెప్పుకున్నారు. దీంతో ఆయన తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వెంటనే వంతెన ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనుకున్న విధంగా నరేంద్ర వర్మ విజయం సాధించడంతో పాటు కూటమీ ప్రభుత్వం కూడా కొలువు దీరింది.

ఇక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే సీఎం ద్రుష్టికి తీసుకెళ్లారు. అయితే దానికి ఆయన సానుకూలంగా స్పందించి వంతేన నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇదే సమయంలో  సీఎం చంద్రబాబు పీ4 విధానాన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లోని కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడమే కాకుండా ఆయా గ్రామాల పరిధిలో అవసరమైన మౌళిక సదుపాయలు ఏర్పాటు చేయాలని ఈ విధానం ద్వారా ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మే స్వయంగా రంగంలోకి దిగారు. తన సొంత డబ్బులతో వంతెన నిర్మించేందుకు నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటవెంటనే పనులు పూర్తయ్యాయి. వంతెన అందుబాటులోకి వచ్చింది.

వీడియో చూడండి..

వంతెన అందుబాటులోకి వచ్చిన రోజే ఎమ్మెల్యే పుట్టిన రోజు కూడా కావడంతో అందరూ సంతోషంగా వంతెనను ప్రారంభించుకున్నారు. గత 35 ఏళ్లుగా వంతెన కోసం ఎదురు చూస్తున్నామని నరేంద్ర వర్మ తన సొంత డబ్బులతో నిర్మించడేమ కాకండా పుట్టిన రోజు కానుకగా స్థానికులకు అందించడంపై అందరూ హార్షం వ్యక్త చేశారు. సుబ్బారెడ్డిపాలెం వాసులతో పాటు బాపట్ల డంపింగ్ యార్డు చేరుకునేందుకు మార్గం సుగమం కావడంతో అటు పట్టణ వాసుల కూడా ఎమ్మెల్యేను అభినందనల్లో ముంచెత్తారు. సిఎం చంద్రబాబు తీసుకొచ్చిన పి4 విధానంతో తమ గ్రామాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పడి ఏళ్ల తరబడి అపరిష్క్రుతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం దొరకడంతో గ్రామాల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..