Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నికల ప్రక్రియ ప్రశాంతం.. గతంలో కంటే ఈసారి..

|

Oct 30, 2021 | 9:37 PM

బద్వేలు ఉపఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గతంలో కంటే.. ఓటింగ్‌ శాతం ఈసారి తగ్గింది. ఓటింగ్‌ ముగిసే సమయానికి 68.12శాతంగా నమోదయింది.

Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నికల ప్రక్రియ ప్రశాంతం.. గతంలో కంటే ఈసారి..
Badvel By Election Polling
Follow us on

బద్వేలు ఉపఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గతంలో కంటే.. ఓటింగ్‌ శాతం ఈసారి తగ్గింది. ఓటింగ్‌ ముగిసే సమయానికి 68.12శాతంగా నమోదయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటలకు ముగిసింది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో 76.37 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం 68.12గా నమోదైంది.

వచ్చే నెల 2న ఉప ఎన్నికల ఫలితం వెలువడనుంది. కొన్నిచోట్ల బయటి వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అట్లూరు పోలింగ్ కేంద్రంలో గుర్తుంపుకార్డులు లేనివారిని వెనక్కి పంపారు. ఎస్ వెంకటాపురంలో భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బయటి వ్యక్తులు ఓటు వేసేందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుర్తింపు కార్డులు లేకపోవడంతో పోలీసులు వారిని తిప్పిపంపారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారికి సర్దిచెప్పారు. ఎస్ వెంకటాపురం కేంద్రాన్ని వైకాపా అభ్యర్థి సుధా, భాజపా అభ్యర్థి సురేశ్‌ సందర్శించారు.

బద్వేల్‌ బైపోల్‌ పోలింగ్‌ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. పోటీ మాత్రం YCP-బీజేపీ మధ్యే జరిగింది. వైసీపీ నుంచి డాక్టర్‌ దాసరి సుధ, బీజేపీ నుంచి పనతల సురేష్‌, కాంగ్రెస్‌ నుంచి కమలమ్మ పోటీ పడ్డారు. 281 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..

PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..