CM YS Jagan Review on Badvel bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా వెంకటసుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన సతీమణి దాసరి సుధను తమ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెడుతున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. బద్వేల్ నియోజకవర్గ గెలుపు బాధ్యతలను సమావేశానికి వచ్చిన నేతలందరికి అప్పగించారు సీఎం. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని సూచించారు.
బద్వేల్‌లో గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ రావాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఒక్క ఓటర్‌నూ పలకరించాలి. పార్టీ నేతలకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. స్వయాన వైద్యురాలు అయిన సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. ఎక్కడా అతి విశ్వాసం వద్దని.. కష్టపడి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సూచించారు జగన్. బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలను మంత్రులు అదిమూలపు సురేష్, అంజాద్ బాషా, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు…సోమవారం నుంచి పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవాలని సూచించారు.. ఒక్కో ఇంటికి కనీసం 3 నుంచి 4 సార్లు వెళ్లాలని చెప్పారు. 2019లో 77 శాతం ఓటింగ్ జరిగిందని.. ఈసారి ఓటింగ్ శాతం మరింత పెరగాలన్నారు.. పోలింగ్‌లో పాల్గొనేలా ఓటర్లలో చైతన్యం కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్.
ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా ఓటింగ్ పెంచాలన్నారు. నెలరోజులపాటు నాయకులు తమ సమయాన్ని కేటాయించి ఎన్నికపై దృష్టిపెట్టాలని కోరారు సీఎం జగన్. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారన్న సీఎం.. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వాడ వాడలా వివరించాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి సుధ మాట్లాడుతూ.. అభివృద్ది, సంక్షేమ పథకాలే ప్రధాన అజెండగా ప్రచారం నిర్వహిస్తామన్నారు.
Read Also… Viral Video: ఈ యువకుడి ధైర్యానికి ఖచ్చితంగా సలాం కొట్టాల్సిందే.. మొసలికే చుక్కలు చూపించాడుగా.!