మళ్లీ తెరపైకి వచ్చిన అయేషామీరా హత్య కేసు.. హాస్టల్ వార్డెన్‌ను పిలిచిన సీబీఐ

|

May 03, 2023 | 9:29 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ కేంద్రంగా జరుగుతోంది. గతంలో సత్యం బాబును నిర్దోషిగా తేల్చడంతో అయేషా తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు.

మళ్లీ తెరపైకి వచ్చిన అయేషామీరా హత్య కేసు.. హాస్టల్ వార్డెన్‌ను పిలిచిన సీబీఐ
Ayesha Meera
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ కేంద్రంగా జరుగుతోంది. గతంలో సత్యం బాబును నిర్దోషిగా తేల్చడంతో అయేషా తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. దీంతో ఆ కేసును విచారించాలంటూ కోర్టు సీబీఐకి ఆదేశించింది. అయితే తాజాగా మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ ఆయేషా మీరా ఉన్న హాస్టల్​వార్డెన్​ను పిలిచింది. విచారణ జరిగిన తర్వాత వార్డెన్​ సీబీఐ కార్యాలయం నుంచి వెళ్లి పోయారు.

2007 డిసెంబర్ 27 వ తారీఖున విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషామీరాను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో సత్యంబాబును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా.. 2017లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు నిందితులను తేల్చే పనిలో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. 

ఇవి కూడా చదవండి