ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా ఉన్న యాక్సిస్ బ్యాంక్ కొత్తగా 6 శాఖలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వినియోగదారులకు విస్తృత శ్రేణి బ్యాంకింగ్ సేవలను అందించనుంది. ఈ కొత్త శాఖలు గుంటూరు జిల్లాలోని పొన్నూరు, అమరావతి రోడ్డులో, రావులపాలెంలో డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తిరుపతి జిల్లా వెంకటగిరి, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల, అనంతపురం జిల్లా రాంనగర్(అనంతపురం)లో ప్రారంభం కానున్నాయి.
చలపతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్, వీరాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డేగల ప్రభాకర్, బ్రహ్మర టౌన్‌షిప్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావులు గుంటూరులోని అమరావతి రోడ్డులో 194వ శాఖను బ్రాంచ్ ఆపరేషనల్ హెడ్ షేఖ్ రసూల్ సమక్షంలో ప్రారంభించారు. ఈ కొత్త శాఖల్లో విభిన్న బ్యాంకింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగత బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, లోన్ ప్రొడక్ట్‌లు (వ్యక్తిగత, బంగారం, ఇల్లు, వాహనం, వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ మొదలైనవి), బీమా సౌకర్యాల వంటి విస్తృత శ్రేణి బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. కార్పొరేట్, ఎంఎస్ఏంఈలతో పాటు వ్యవసాయం, రిటైల్ వ్యాపారాలకు సేవలు అందిస్తుంది. ఈ శాఖలు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఈ సేవలను విస్తరించనుంది.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అండ్ బ్రాంచ్ బ్యాంకింగ్, హెడ్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. ఈ శాఖల ద్వారా యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం తోపాటు ఈ ప్రాంతాల ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బ్యాంక్ తన కస్టమర్లకు అత్యాధునిక సాంకేతికతను అందించడంతో పాటు రోజువారీ లావాదేవీలలో డిజిటల్ చెల్లింపులు సులభతరం చేయనున్నట్లు తెలిపారు.
అలాగే నగదు రహిత లావాదేవీల ద్వారా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి యాక్సిస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శాఖల ద్వారా యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం, ఈ ప్రాంతాల ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 194 శాఖలు, ATMలను కలిగి ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి