Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. అవనిగడ్డ సీఐ ఫేస్‌బుక్ హ్యాక్.. డబ్బులు అవసరం పంపండి అంటూ అభ్యర్థనలు..

| Edited By: Pardhasaradhi Peri

Jan 11, 2021 | 8:33 AM

Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం అమాయకులనే టార్గెట్‌గా చేసుకుని జేబులు కొల్లగొట్టిన దుండగులు..

Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. అవనిగడ్డ  సీఐ ఫేస్‌బుక్ హ్యాక్.. డబ్బులు అవసరం పంపండి అంటూ అభ్యర్థనలు..
Follow us on

Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం అమాయకులనే టార్గెట్‌గా చేసుకుని జేబులు కొల్లగొట్టిన దుండగులు.. ఇప్పుడు ఏకంగా నేరగాళ్ల ఆటలు కట్టించే పోలీసులే లక్ష్యంగా చేసుకుని దూకుడు ప్రదర్శిస్తున్నారు. వారి పేరిటే దోపిడీకి పాల్పడుతూ.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి ఆయన ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నవారిని డబ్బులు అడిగిన విషయం తెలిసిందే. అలాగే ఓ కలెక్టర్‌ పేరిట కూడా ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. అయితే సదరు అధికారులు వెంటనే అప్రమత్తం అవడంతో కేటుగాళ్లు ఆటలకు బ్రేకులు పడ్డాయి.

ఇదిలాఉంటే తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ  సీఐ రవికుమార్‌ను సైబర్ నేరగాళ్లు టార్గె్ట్ చేసుకున్నారు. ఆయన ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేశారు. తనకు డబ్బు అవసరం ఉందంటూ సీఐ పేరిట ఫేస్‌బుక్ స్నేహితులకు సైబర్ నేరగాళ్లు అభ్యర్థనలు పంపారు. అయితే ఈ అభ్యర్థనను అనుమానించిన ఆయన స్నేహితులు నేరగా సీఐ రవికుమార్‌కే ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో వెంటనే అలర్ట్ అయిన సీఐ రవికుమార్.. తన ఫేస్‌బుక్ హ్యాకింగ్‌కు గురైందని ప్రకటించారు. ఎవరూ డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

ప్రవాస భారతీయురాలికి అమెరికా వైట్‌హౌస్‌లో కీలక బాధ్యత.. కమలా హ్యారిస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా

Satyadev Godse Movie Heroine: ‘గాడ్సే’ హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా..!