Andhra Pradesh: కోడిగుడ్లతో దాడి.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద కొనసాగుతున్న హై టెన్షన్..!

|

Jun 07, 2024 | 5:26 PM

పోలింగ్‌ రోజు జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ గొడవలు జరిగాయి. పవర్‌ చేతులు మారిన వేళ ఓవైపు రెడ్‌ బుక్‌ హోర్డింగ్స్‌ చర్చకు దారితీస్తే తాజాగా ఎగ్‌ అటాక్‌ సంచలనం రేపింది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు.

Andhra Pradesh: కోడిగుడ్లతో దాడి.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద కొనసాగుతున్న హై టెన్షన్..!
High Tension
Follow us on

ఆట ముగిసింది. ఇక వేట మొదలైందా? పోలింగ్‌ రోజు జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ గొడవలు జరిగాయి. పవర్‌ చేతులు మారిన వేళ ఓవైపు రెడ్‌ బుక్‌ హోర్డింగ్స్‌ చర్చకు దారితీస్తే తాజాగా ఎగ్‌ అటాక్‌ సంచలనం రేపింది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు.

మరోవైపు బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారనే ఫిర్యాదుల క్రమంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బారికేడ్లను ఏర్పాటు చేసి సెక్యూరిటీ పెంచారు. గట్టి బందోబస్తు చేసినా సరే అలజడి జరగనే జరిగింది. విజయవాడలో కొడాలి నాని.. గన్నవరంలో వల్లభనేని వంశీ ఇళ్లపై దాడికి ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. ఇళ్లలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. కోడిగుడ్లు విసిరారు. అలర్టయిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులకు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

ఇదిలావుంటే, చర్యకు ప్రతిచర్య తప్పదు. ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ శ్రీకాంత్. అయితే లెక్కకు లెక్క ముట్టచెప్పడం ఏమాత్రం రివేంజ్‌ పాలిటిక్స్‌ కాదన్నారు బుద్దా వెంకన్న. అది కనీస ధర్మం అన్నారు. ప్రతీకారం తీర్చుకోకపోతే పలుచనైపోమా? అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించిన వాళ్లెవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు వెంకన్న.

అటు కడప గడపలో వార్‌ మరో రేంజ్‌కు వెళ్లింది. జగన్‌ను అవినాషన్‌ను జైలుకు పంపుతామని సవాల్‌ చేశారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అంతేకాదు వైసీపీ ఖాళీ కావడం ఖాయమంటూ మరో సంచలన కామెంట్‌ చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా దాడులకు పాల్పడుతున్నారని ట్వీట్‌ చేశారు జగన్. చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ కోరారు. కొడాలి నాని, వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…