Attack on Linemen: విద్యుత్ బకాయిలు చెల్లించని.. ఇంటి ఫ్యూజు కట్‌చేసినందుకు కుటుంబసభ్యులు విద్యుత్ లైన్‌మెన్‌పై దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో శనివారం చోటుచేసుకుంది. నగరంలోని తోట కనకమ్మ వీధిలో నివసిస్తున్న ఫయాజ్ కొంతకాలం నుంచి ఇంటి విద్యుత్ బిల్లు చెల్లించడం లేదు. దీంతో శనివారం ఉదయం లైన్ మెన్ కొల్లి శ్రీనివాస్ ఫయాజ్ ఇంటికెళ్లి చెల్లించాలని సూచించాడు. ఈ క్రమంలో వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో లైన్‌మెన్ శ్రీనివాస్.. ఫయాజ్ ఇంట్లోనున్న విద్యుత్ ఫ్యూజును తొలగించాడు. అనంతరం ఆగ్రహానికి గురైన ఫయాజ్.. ఫోన్ చేసి ఇంకో వ్యక్తిని ఇంటికి పిలిపించాడు.
అనంతరం ఫయాజ్.. అల్లా బక్షు అనే వ్యక్తితో కలిసి శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో లైన్‌మెన్ శ్రీనివాస్ దాడి ఘటనపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భవానీపురం పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన సన్నివేశం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది.
Also Read: