Atmakur By Poll Results: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా.. అఖండ విజయం సాధించిన విక్రమ్ రెడ్డి..

|

Jun 26, 2022 | 12:06 PM

Atmakur By Poll Results: ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అఖండ విజయాన్ని..

Atmakur By Poll Results: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా.. అఖండ విజయం సాధించిన విక్రమ్ రెడ్డి..
Mekapati Vikram Reddy
Follow us on

Atmakur By Poll Results: ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. 82,888 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై విజయ బావుటా ఎగురవేశారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది మొదలు.. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతీ రౌండ్‌లోనూ వైసీపీ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కు విక్రమ్ రెడ్డి మెజార్టీ భారీగా పెరుగుతూ వచ్చింది. మొత్తం 1,02,240 ఓట్లు పోలవగా.. 82,888 ఓట్ల మెజార్టీ సాధించారు విక్రమ్ రెడ్డి. ఆత్మకూరు ఉపఎన్నికల్లో ఫ్యాన్ జోరుకు కమలం పార్టీ కొట్టుకుపోయింది. కనీసం ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది.