
పాలకొల్లు, ఫిబ్రవరి 14: అమ్మవారు ఒంటి మీదకు రావడం, వాక్కులు చెప్పడం మనం కొన్ని గుళ్ల వద్ద చూసే ఉంటాం. అయితే కొంతమంది తమ, తమ ఇళ్ల వద్దే పూనకంతో ఊగిపోతూ ఇప్పుడు వాక్కులు చెబుతున్నారు. అలానే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో.. స్థానికంగా ఉండే ఓ మహిళకు అమ్మవారు ఒంటి మీదకు వచ్చి.. గ్రామ శివారు చెరువు వద్ద దేవత విగ్రహం ఉన్నట్లు చెప్పింది. దీంతో ఆమె చెప్పిన రామయ్య హాలు ప్రాంతంలో ఓ నీటి గుంతలో వెతక్కా.. అమ్మవారి విగ్రహం కనిపించింది. దీంతో అందరూ ఆశ్యర్యపోయారు. విగ్రహాన్ని స్థానికులు బయటకు తీశారు. మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి.. విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. అమ్మవారు చెప్పిన ప్రదేశంలో వెతికితే దొరికిన విగ్రహం దొరికిందని స్థానికులు అంటున్నారు. ఇది అమ్మవారి మహిమే అని చెబుతున్నారు.
ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్. ఈ విగ్రహం బయటపడిన ప్రాంతంలో శిలువ కూడా దర్శనమిచ్చింది. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది.. వెంటనే పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. ఆ ప్రాంతంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. అయితే అమ్మవారి విగ్రహాన్ని తమకు తిరిగి అప్పగిస్తే.. చిన్న గుడి కట్టి పూజలు చేసుకుంటామని రామయ్య హాలు ప్రాంత మహిళలు.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి కలిసి విన్నవించుకున్నారు. మొత్తానికి విగ్రహం వివాదం పాలకొల్లులో హాట్ టాపిక్ అయింది.
ఎర్రవరం గ్రామంలో 8వ తరగతి చదివే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు. అలా బాలుడు చెప్పిన చెరువు కట్ట దగ్గర ఉన్న దుళ్లగుట్టను తవ్విగా అనవాళ్లు కనిపించాయి. అప్పట్నుంచి స్వయంభుగా వెలసిన ఈ దైవ క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆ టెంపుల్ ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది.
(గమనిక: ఈ ఘటనలను టీవీ9 తెలుగు నిర్ధారించడం లేదు. కేవలం అక్కడి స్థానికులు చెప్పిన సమాచారం మీకు అందిస్తున్నాం)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…