Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..

బాపట్లజిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలోని భారత్ పేట్రోల్ బంక్‌లో ఘర్షణ జరిగింది. 50 రూపాయలు అప్పుగా పెట్రోల్‌ పోయలేదన్న కోపంతో బంక్‌ సిబ్బందిపై ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ దౌర్జన్యానికి దిగాడు. అప్పు ఎందుకు పోయవంటూ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్న ఓ యువకుడిని బాదిపారేశాడు.

Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
Telugu News

Edited By: Ravi Kiran

Updated on: Oct 23, 2025 | 1:05 PM

బాపట్లజిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలోని భారత్ పేట్రోల్ బంక్‌లో ఘర్షణ జరిగింది. 50 రూపాయలు అప్పుగా పెట్రోల్‌ పోయలేదన్న కోపంతో బంక్‌ సిబ్బందిపై ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ దౌర్జన్యానికి దిగాడు. అప్పు ఎందుకు పోయవంటూ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్న ఓ యువకుడిని బాదిపారేశాడు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ఓ ఏఆర్‌ కానిస్టేబుల్ తన మిత్రులతో కలసి పెట్రోల్‌ బంకు‌లో చేసిన బీభత్సం సీసీకెమెరాలో రికార్డయింది.

పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఓ ఏఆర్‌ కానిస్టేబుల్ తన మిత్రులతో కలసి దాడికి తెగబడిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలో వెలుగు చూసింది. బుధవారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌కు ఓ ఏఆర్‌ కానిస్టేబుల్ తన మిత్రులతో కలసి వచ్చాడు. తన బైక్‌కు పెట్రోల్ అప్పుగా కొట్టాలని సిబ్బందిని అడిగాడు. బంక్ సిబ్బంది మాత్రం యజమాని అనుమతి లేకుండా పెట్రోల్ అప్పుగా కొట్టడం కుదరదన్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ ఏఆర్‌ కానిస్టేబుల్ విచక్షణ మరచి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా పెట్రల్ మిషన్ గన్‌తో డాడి చేశాడు. సిబ్బందిపై కానిస్టేబుల్ చేసిన దౌర్జన్యం, బూతు పురాణమంతా పెట్రోల్ బంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సిబ్బందిపై దాడి విషయం తెలుసుకున్న పెట్రోల్ బంక్ యజమాని వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిబ్బందిపై దాడికి పాల్పడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు.