Andhra Pradesh: పోలీస్ క్వార్టర్స్ లో ఉరేసుకుని.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

|

May 16, 2022 | 10:48 AM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో పోలీస్ అధికారుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో రివాల్వర్ తో ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరవకముందే మరో ఘటనలో...

Andhra Pradesh: పోలీస్ క్వార్టర్స్ లో ఉరేసుకుని.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Etcherla
Follow us on

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో పోలీస్ అధికారుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో రివాల్వర్ తో ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరవకముందే మరో ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ తనువు చాలించారు. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో విషాదం నెలకొంది. ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. రోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

గతంలో.. కాకినాడ జిల్లాలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలకృష్ణ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Viral Photo: ఈ ఫొటోలో ఉన్న రెండో చిరుత తల ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. ఎంత వెతికినా కనిపించట్లేదా.?

Waitress Talent: వాటే ట్యాలెంట్‌.. బీర్‌ బాటిల్‌ ఇలాకూడా ఓపెన్‌ చేస్తారా..? చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!