APPSC Exam Dates: ఏపీ నిరుద్యోగులకు గమనిక.. రాత పరీక్షల తేదీలను విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే..

|

Aug 18, 2023 | 9:04 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు ఎపీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన 11 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను గురువారం (ఆగ‌స్టు 17) విడుదలయ్యాయి. ఏయే పరీక్ష ఏయే తేదీల్లో ఉండనున్నాయంటే.. సెప్టెంబరు 25 నుంచి 27వ తేదీ వరకు ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్నాయి..

APPSC Exam Dates: ఏపీ నిరుద్యోగులకు గమనిక.. రాత పరీక్షల తేదీలను విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే..
APPSC Exam Dates
Follow us on

అమరావతి, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు ఎపీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన 11 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను గురువారం (ఆగ‌స్టు 17) విడుదలయ్యాయి. ఏయే పరీక్ష ఏయే తేదీల్లో ఉండనున్నాయంటే.. సెప్టెంబరు 25 నుంచి 27వ తేదీ వరకు ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (భూగర్భ నీటిపారుదల శాఖ), అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, గ్రూపు 4 (లిమిటెడ్‌), జూనియర్‌ ట్రాన్సలేటర్‌ తెలుగు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మైన్స్‌), డిస్ట్రిక్ట్‌ ప్రొబెషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 (జువైనల్‌ వెల్ఫేర్‌) ఉద్యోగాలకు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష అక్టోబరు 3వ తేదీన జరగనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి సబ్జెక్టు రాత పరీక్షలు వేర్వేరు తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరనున్నాయి. పూర్తి వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలు ఆగస్టు నెలాఖరు వరకు.. మూడోసారి గడువు పొడిగింపు

2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు గడువు తేదీ ఇంటర్‌ బోర్డు మరోమారు పొడిగించింది. ఆగస్టు నెలాఖరు వరకు చేరవచ్చని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఇప్పటికే రెండుసార్లు గడువు తేదీని పొడిగించిన బోర్డు తాజాగా ఆగ‌స్టు 31 వరకు పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగ‌స్టు 16తో గడువు ముగిసింది. గడువు ముగిసిన తర్వాత ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశం పొందితే రూ.750 ఆలస్య రుసుం చెల్లించాలని ఇంటర్‌బోర్డు వివరించింది. ఐతే ప్రభుత్వ కాలేజీలకు మాత్రం ఎటువంటి ఆలస్య రుసుము లేదు.

‘దోస్త్‌’ ప్రత్యేక విడతలో 39,969 మందికి సీట్లు

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ‘దోస్త్‌’ ప్రత్యేక విడతకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో దాదాపు 39,969 మంది విద్యార్ధులు సీట్లు పొందారు. ప్రత్యేక విడత సీట్ల ఫలితాలను ఆగ‌స్టు 17న‌ విడుదల చేశారు. సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సిందిగా సూచించారు. సీట్లు పొందిన కాలేజీల్లో ఆగ‌స్టు 18 నుంచి ఆగ‌స్టు 21వరకు సీసీఓటీపీని సమర్పించాలని, లేని పక్షంలో సీటు రద్దు అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.