APPSC: ఏపీలో గ్రూప్‌1 పరీక్ష వాయిదా పడనుందా.? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్‌..

|

Feb 25, 2024 | 2:58 PM

దీంతో ఈ వార్తలపై ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. మార్చి 17వ తేదీన గ్రూప్‌1 పరీక్ష యథావిధిగా ఉంటుందని, అభ్యర్థులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. దీంతో పరీక్ష వాయిదాపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఇదిలా ఉంటే గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌లో...

APPSC: ఏపీలో గ్రూప్‌1 పరీక్ష వాయిదా పడనుందా.? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్‌..
Appsc
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రూప్‌ 1 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 17వ తేదీన గ్రూప్‌ 1 పరీక్ష జరగనుందని ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే తాజాగా ఈ పరీక్షలు వాయిదా పడనున్నాయని వార్తలు వచ్చాయి. మార్చి 17న జరగనున్న పరీక్ష వాయిదా పడనుంది. అంటూ కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

దీంతో ఈ వార్తలపై ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. మార్చి 17వ తేదీన గ్రూప్‌1 పరీక్ష యథావిధిగా ఉంటుందని, అభ్యర్థులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. దీంతో పరీక్ష వాయిదాపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఇదిలా ఉంటే గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌లో భాగంగా 81 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. వీటిలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్‌ ట్యాక్స్‌ కమిషనర్స్‌ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్‌–2 మున్సిపల్‌ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఆదివారం ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 899 గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో ఫేక్‌ అడ్మిట్‌ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్ తెలిపారు. జూన్ లేదా జులైలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తాం అని ఆయన తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..