AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల 2 రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం

|

Mar 19, 2022 | 2:50 PM

AP Weather Alert: ఓ వైపు ఏపీ (Andhra pradesh) లో రోజు రోజుకీ ఎండల తీవ్రత పెరుగుతుంటే .. మరోవైపు బంగాళాఖాతం (bay of bengal) లో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం..

AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల 2 రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం
Ap Weather Alert
Follow us on

AP Weather Alert: ఓ వైపు ఏపీ (Andhra pradesh) లో రోజు రోజుకీ ఎండల తీవ్రత పెరుగుతుంటే .. మరోవైపు బంగాళాఖాతం (bay of bengal) లో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం,  తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ.. ఈరోజు 08. 30 గంటల IST సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం..  దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది అండమాన్ అండ్  నికోబార్ దీవుల వెంబడి ఉత్తర దిశగా దాదాపుగా కదులుతూ, మార్చి 20 ఉదయం నాటికి వాయుగుండముగా మారనుందని తెలిపారు. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉంది.  అనంతరం ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, 2022 న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని.. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అమరావతి వాతవరణ శాఖ చేసింది.

  1. ఉత్తర కోస్తా ఆంధ్ర,  యానాం  ప్రాంతాల్లో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
  2. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు , ఎల్లుండి రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
  3.  రాయలసీమలో కూడా ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు , ఎల్లుండి రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Read Also  

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!