AP Weather: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులు.. రానున్న 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

ఏపీలో అకాల వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. అంతవరకు ఎండ కొడుతుంది. అంతలోనే భారీ వర్షం కురుస్తుంది. తాజాగా పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

AP Weather: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులు.. రానున్న 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
Thunderstorm

Updated on: Apr 29, 2023 | 5:37 PM

ఏపీ ప్రజలకు అలెర్ట్. రానున్న 03 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, YSR కడప.  అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల  పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనితో పాటు గంటకు 40 కిమీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  కాగా ఆంధ్రప్రదేశ్,  యానంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / నైరుతి గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

ఆదివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు మరియు వడగండ్లు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

ఆదివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తలు  కోసం క్లిక్ చేయండి..