AP Weather Report: రాగల 24 గంటలలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. నైరుతి రుతు పవనాల ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతరణంలో చాలా మార్పులు వస్తాయన్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉంది.
ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అలాగే కొన్ని కొన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక సోమవారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
దక్షిణకోస్తాంధ్ర విషయానికి వస్తే.. ఈ రోజు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది. సోమవారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. రాయలసీమ ప్రాంతంలోనూ దాదాపుగా ఇదే తీరుగా వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల కురుసే ఛాన్స్ ఉంది. సోమవారం నాడు కూడా అక్కడక్కడ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also read: