Ap Weather Report: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర గల ప్రాంతంలో గల తుఫాను ప్రసరణ సగటు సముద్ర మట్టానికి 7.6 కిమీ ఎత్తు వరకు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో.. వచ్చే 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తరువాతి 48 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బల పడుతుంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:
*ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
* పలు జిల్లాలో భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
* ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
* ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
దక్షిణ కోస్తా ఆంధ్ర :
*ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది
రాయలసీమ:
*ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
Also Read: Vinayaka Chaviti-Chiru House: మెగాస్టార్ ఇంట్లో ఘనంగా వినాయక చవితి పూజ.. అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్న చిరు