Heat Wave
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు వాతావరణ పరిస్థితులను అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయవ్య దిశల్లో గాలులువీస్తున్నాయని.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
- మంగళవారం: పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° డిగ్రీలు పెరిగే అవకాశము ఉన్నది.
- బుధవారం: వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4°లు పెరిగే అవకాశము ఉన్నది.
- గురువారం: తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు 2° నుండి 3° C వరకు తగ్గే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
- ఈరోజు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° డిగ్రీలు పెరిగే అవకాశము ఉన్నది.
- రేపు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4°లు పెరిగే అవకాశము ఉన్నది.
- ఎల్లుండి: తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు 2° నుండి 3° C వరకు తగ్గే అవకాశం ఉంది.
రాయలసీమ:
- ఈరోజు , రేపు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. వేడితో కూడిన, అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4°లు పెరిగే అవకాశము ఉన్నది.
- ఎల్లుండి: తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు పెరిగే అవకాశము ఉన్నది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..