AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

|

Apr 23, 2022 | 10:43 AM

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎండలు మండించనున్నాయని.. రానున్న నాలుగు రోజుల పాటు.. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ(IMD) ప్రకటించింది..

AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Follow us on

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎండలు మండించనున్నాయని.. రానున్న నాలుగు రోజుల పాటు.. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ(IMD) ప్రకటించింది. ప్రజలు అవసరం అయితేనే బయటకు రండి అంటూ హెచ్చరించింది. రానున్న 4 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు(Heat Waves) వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, విశాఖ పట్నం, విజయనగరం జిల్లాలో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండనున్నదని పేర్కొంది. పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది.  కర్నూలు, తిరుపతిలో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.  ఈ నెల 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నాలుగు రోజులు ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. అవసరం అయితే తప్ప ఎండలోకి రావొద్దని  తెలిపింది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి తరచుగా పానీయాలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తరచుగా తాగుతుండాలని చెప్పారు.

 

Also Read: Viral Video: దేశీ.. ఏసీ.. కూలర్‌‌ను ఇలా కూడా వాడొచ్చా..! వీడియో చూస్తే దిమ్మ తిరగాల్సిందే..

India Covid-19: ఫోర్త్ వేవ్ భయందోళనలు.. దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు