Cyclone Jawad: ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ వాన గండం పొంచి ఉంది. జోవాద్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల చేరువలో కేంద్రీకృతమైన. ఇది విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. జోవాద్ … గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అయితే ఇంకా విశాఖపట్నం పై ఈ తుఫాన్ ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించలేదు.
ఈ జోవాద్ తుఫాన్ రేపు మధ్యాహ్నం పూరీ వద్ద తీరం దాటే అవకాశంఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ సముద్ర తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం పరిస్థిపై ప్రధాని మోడీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. అంతేకాదు ముందస్తు చర్యల్లో భాగంగా తుఫాన్ కారణంగా దక్షిణ మధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వే 120 రైళ్లను రద్దు చేసింది. తుఫాన్ అత్యవసర సహాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహా 1,735 సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాఫ్టర్లు, పడవలతో తూర్పు నావికాదళం సర్వసన్నద్ధంగా ఉంది.
Also Read: ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..