Ap Weather Report: ఏపీలో పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..

Ap Weather Report: ఉత్తర తమిళనాడు.. దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 km ఎత్తు వద్ద ఒక 'ఉపరితల ఆవర్తనం' ఏర్పడింది.  దీంతో తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు..

Ap Weather Report: ఏపీలో పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..
Telangana Weather Forecast

Updated on: Sep 19, 2021 | 3:22 PM

Ap Weather Report: ఉత్తర తమిళనాడు.. దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 km ఎత్తు వద్ద ఒక ‘ఉపరితల ఆవర్తనం’ ఏర్పడింది.  దీంతో తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు నిన్న ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ ప్రస్తుతము సగటు సముద్రమట్టానికి 0.9 km ఎత్తు వద్ద కొనసాగుతున్నది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ వివిధ ప్రాంతాల్లో ఇలా ఉంటాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాం :

*ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
* ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
* ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్ర :

*ఈరోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
*ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:

*ఈరోజు, రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
*ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

Also Read: తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా చక్రస్నానం.. పాలు,పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చంద‌నంతో అభిషేకం