
గూడ్స్ రైలు ఇంజన్ బోగీలను వదిలి వెళ్లిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మొలకలమూరు నుంచి జిందాల్‌కు 45 బోగీలతో కూడా ఒక గూడ్స్ రైలు వెళ్తుంది. ఈ ట్రైన్ రాయదుర్గం సమీపంలోకి రాగాలనే గూడ్స్ రైలు 4వ వ్యాగన్ లింక్ కట్ అయిపోయింది. దీంతో ఇంజిన్, దానికి లింక్ అయి ఉన్న బోగిలు విడిపోయాయి. దీంతో విడిపోయిన 45 బోగీలను పట్టాలపై అలాగే వదిలేసి గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ సుమారు 2 కిటోమీటర్ల దూరం వెళ్లిపోయాడు.
అయితే పట్టాలపై కాలిగా బోగీలను గమనించిన స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం వచ్చారు. అప్రమత్తమైన అధికారులు సదురు గూడ్స్ ట్రైన్ లోకోపైలట్‌కు సామాచారం ఇవ్వగా అతను వెంటనే ట్రైన్‌ను ఆపేసి.. మళ్లీ వెనక్కి వచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న రైల్వే అధికారులు విడిపోయిన బోగీలను ట్రైన్‌కు లింక్ చేశారు. దీంతో ట్రైన్ యధావిధిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదం కారణంగా ఇతర ట్రైన్‌లకు ఎటువంటి అంతరాయం కదుగలేదని అధికారులు స్పష్టం చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.