Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని ప్రకటించింది..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Weather Report

Updated on: Nov 01, 2025 | 6:07 PM

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని ప్రకటించింది.. కాగా.. ఆదివారం వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి..

ఆదివారం (02-11-2025) ఏపీ వాతావరణ సూచనలు ఇవే..

బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.

తెలంగాణ వాతావరణ సూచనలు..

తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గాలులతోపాటు.. మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,67,175 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..