
ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఎన్డీయే ప్రభుత్వం. సో, వచ్చే కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై గట్టిగానే పట్టుబడుతోంది. పనిలోపనిగా వైసీపీ కూడా ఓ కన్నేసి ఉంచుతోంది. వీళ్లేం అడుగుతున్నారు, కేంద్రం ఏం ఇవ్వబోతోంది అని గమనిస్తున్నారు. ఇక్కడో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే.. అడిగింది కేంద్రం ఇవ్వకపోయినా, అనుకున్నదాని కన్నా తక్కువ వచ్చినా.. బంతి ప్రతిపక్షం కోర్టులో పడుతుంది. అంతేకాదు, తమ పార్టీల నేతలకు, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే, రాష్ట్రానికి తక్షణం ఏమేం కావాలో రాసుకుని కేంద్రం ముందు ఉంచింది. ఇంతకీ.. ఏపీ ప్రతిపాదనలేంటి? ప్రతి ఏటా.. కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రీ-బడ్జెట్ మీటింగ్ ఉంటుంది. రాష్ట్రానికి ఏం కావాలో ఆ సమావేశంలో అడుగుతారు. ఏపీ నుంచి ప్రీ-బడ్జెట్ మీటింగ్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరిన్ని నిధులు అడిగింది ఏపీ ప్రభుత్వం. గతంలో మంజూరైన 15వేల కోట్ల రూపాయలకు అదనంగా.. రెండో విడత గ్రాంట్లు కేటాయించి అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేలా సహాయం అందించాలని కోరింది. అంతేకాదు.. అమరావతికి ఏపీ రాజధానిగా చట్టబద్దత కల్పించాలనే స్పెషల్ రిక్వెస్ట్‌ను కేంద్రం ముందుంచింది. అమరావతితో సమానంగా ప్రధాన్యత ఉన్న ప్రాజెక్ట్.. పోలవరమే. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామనే డెడ్‌లైన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు కేంద్రం సహకారం కూడా అవసరం. ఈ విషయంలో ప్రతిపక్ష వైసీపీ కూడా కేంద్రం...