Speaker Tammineni: అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి… ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్

|

Jul 23, 2021 | 9:03 PM

నేరము-శిక్ష. ఈ కాన్సెప్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని భూమిపై లేకుండా...

Speaker Tammineni: అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి... ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్
Speaker Tammineni Sitaram
Follow us on

నేరము-శిక్ష. ఈ కాన్సెప్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని భూమిపై లేకుండా చేయాలన్నారు. పురుషుల ఆలోచనా ధోరణి మారాలన్నారు. సొసైటీలో నైతికత లేకుండా పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే చట్టాలను పక్కనపెట్టి నిందితులను వేటాడాలన్నారు. దిశ యాప్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో తమ్మినేని ఈ కామెంట్స్ చేశారు. దిశపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చిన దోషులను వేటాడారంటూ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను అభినందించారు స్పీకర్ తమ్మినేని. మగాడు అనే వ్యక్తి సమాజానికి ప్రొటక్షన్ ఇవ్వాలి కానీ మృగంలా మారకూడదన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై ఔటాఫ్ లా వెళ్లైనా సరే శిక్షించాలన్నారు. కన్నతండ్రులు పసిపిల్లలను అమానుషంగా చెరబడుతున్నారంటూ ఎమోషనల్ అయ్యారు తమ్మినేని. రాముడు తిరిగిన పుణ్యభూమిలో, కృష్ణుడు నడయాడిన ధర్మభూమిలో.. ఈ దారుణాలు ఏంటంటూ ప్రశ్నించారు. సమాజంలో మానసికమైన మార్పు రావాలని ఆకాంక్షించారు స్పీకర్ తమ్మినేని సీతారం.

కాగా దిశ యాప్‌ను విసృతంగా ప్రమోట్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకే ఏకంగా సీఎం జగన్ కూడా ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ దిశ యాప్ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. యాప్‌ను స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళా ఇన్‌స్టాల్ చేసేలా చూడాలని నాయకులకు, అధికారులకు సీఎం సూచించారు.

Also Read: ఏపీలో భూముల రీ సర్వేకు సంబంధించి కీలక అప్‌డేట్.. రంగంలోకి డ్రోన్స్, రోవర్స్

 వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. వాచ్‌మన్ రంగయ్య సంచలన వాంగ్మూలం